ఆంధ్రప్రదేశ్ లో కరోనా కోరలు చాస్తోంది. అన్ని జిల్లాల్లోనూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అధికార కేంద్రమైన గుంటూరు-కృష్ణా జిల్లాలో దీని తీవ్రత అధికంగా ఉంది.
తాజాగా కరోనా ఏపీ హైకోర్టును కమ్మేసింది. హైకోర్టు లో పని చేస్తున్న 26మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది కి పాజిటివ్ గా తేలింది. ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ మరణం అనంతరం కార్యకలాపాలన్నీ ఆపు చేసి ఉద్యోగులందరికీ కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు. దీనికోసం వారం రోజులు కోర్టులకు సెలవులు ఇచ్చారు.
ఈ క్రమంలోనే తాజాగా ఫలితాలు వచ్చాయి. ఏపీ హైకోర్టులో పనిచేసే 26మందికి పాజిటివ్ గా తేలింది. వారిలో సగం మందికి పైగా కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం లేదని సమాచారం. ఈ 26 మందిని హోం ఐసోలేషన్లో ఉంచారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నారు. వీరి కోసం ఓ ప్రత్యేక వైద్య బృందాన్ని సైతం ప్రభుత్వం నియమించింది.