కరోనా వైరస్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. ఏపీలో ప్రభుత్వం మహమ్మారి కట్టడి కి పటిష్టమైన చర్యలు తీసుకుంటునప్పటికీ కూడా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే ప్రకాశం జిల్లా రిమ్స్ ఆస్పత్రి లో ఓ దారుణమైన ఘటన చోటేచేసుకుంది అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. ప్రకాశం జిల్లాలో కరోనా బారిన పడిన ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఐసోలేషన్ లో చేరితే సరైన వైద్యం అంద లేదని , శ్వాస ఆడడం లేదని, వెంటిలేటర్లు పనిచేయడం లేదని, ఇలా అయితే రేపు ఉదయానికల్లా చని పోతానంటూ స్నేహితుల తో చాటింగ్ చేశాడని . భయపడ్డట్టే.. సోమవారం ఆ టెక్నీషియన్ చని పోవడని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. ప్రకాశం జిల్లా , కురిచేడు మండలం, అలవలపాడుకు చెందిన యువకుడు సంతమాగులూరు పీహెచ్ సీ నుంచి 3నెలల క్రితం మార్కాపురం ఏరియా ఆసుపత్రికి బదిలీపై వచ్చాడు. ఈ తరుణంలోనే ఆ యువకుడికి కరోనా సోకడంతో గత నెల 26న రిమ్స్‌లోని ఐసోలేషన్ కు తరలించారు. అక్కడ సరైన వైద్యసేవలు లేక పోవడం పై బాధితుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడని, ఇదే విషయంపై జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ల వాట్సాప్ గ్రూప్ లో ఆదివారం చాటింగ్ చేశాడని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. తాను రోజు రోజు కు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నానని, బహుశా సోమవారం ఉదయానికల్లా చనిపోతానని ఆందోళన వ్యక్తం చేశాడని , అతడు చెప్పినట్లుగానే సోమవారం ఉదయం ఆ యువకుడు మృతిచెందాడని రిమ్స్‌లోని మెడికల్ కాలేజి ల్యాబ్ టెక్నీషియన్లు ధర్నా నిర్వహించారు. మృతిచెందిన టెక్నీషియన్ కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే విధుల్లో మరణించినందున రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, మృతుని భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.