ఏపీలో రికార్డుస్థాయిలో మ‌ర‌ణాలు: ఒక్క‌రోజే 15 మంది మృతి, కొత్త‌గా 1,608 కేసులు

Update: 2020-07-10 11:10 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభ‌ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తీవ్రంగా ఉంది. రోజుకు ప‌దిహేను వంద‌ల‌కు పైగా కేసులు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా శుక్ర‌వారం 1,608 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 24 గంట‌ల్లో 21,020 న‌మూనాలు పరీక్షించగా వాటిలో ఏపీకి చెందిన 1,576 కేసులు ఉండ‌గా.. 32 కేసులు ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారివి ఉన్నాయి. తాజాగా వైర‌స్‌తో బాధ‌ప‌డుతూ ఏకంగా 15మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్య‌లో వైర‌స్‌తో మృతిచెంద‌డం తొలిసారి.

వీటితో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,422కి చేరింది. వైర‌స్ నుంచి కోలుకుని కొత్త‌గా 981 మంది డిశ్చార్జయ్యారు. వీరితో క‌లిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 13,194గా ఉంది. రాష్ట్రంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 292కు చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 11,936 యాక్టివ్ కేసులుగా ఉండ‌గా.. వారిలో చాలామంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతుండ‌గా మ‌రికొంద‌రు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పరీక్ష‌లు 11 ల‌క్షలు దాటాయి. ఇప్ప‌టివ‌ర‌కు 11,15,635 మందికి వైద్య ప‌రీక్ష‌లు చేశారు. ప్ర‌తి మిలియ‌న్ మందిలో 20,892 మందికి వైద్య ప‌రీక్ష‌లు చేశార‌ని వైద్యారోగ్య శాఖ త‌న బులెటిన్‌లో ప్ర‌క‌టించింది.
Tags:    

Similar News