వైద్యశాఖమంత్రి సొంత జిల్లాలో ఎమిటీ దారుణం?

Update: 2020-07-29 03:45 GMT
ఆయన రాష్ట్రానికి వైద్యశాఖ మంత్రి.. రాష్ట్రమొత్తం కరోనా కల్లోలంలో స్టిక్ట్ గా అమలు చేయాల్సిన వ్యక్తి. కానీ తన సొంత జిల్లా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో దారుణమైన కరోనా వైద్యం అందిస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వైనంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కరోనా ఆస్పత్రిలో అధ్వాన సేవలు అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడికి వస్తే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీనే లేదని ఆడిపోసుకుంటున్నారు. ప్రాణాలు పోతే కనీసం మృతదేహాలను తరలించడం లేదట..

ఏలూరు స్వయంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని సొంత నియోజకవర్గం. ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచిన నాని ప్రస్తుతం డిప్యూటీ సీఎం. వైద్యఆరోగ్యశాఖ ఆయన ఆధీనంలోనే ఉంది. అయినా కూడా ఏలూరులో వైద్యసేవలు ఇంత దారుణంగా ఉన్న చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రమంతా వైద్యసేవలపై పర్యటిస్తున్న ఆళ్ల నాని తన సొంత నియోజకవర్గం ఏలూరులో ఇంత దారుణంగా సేవలున్నా పట్టించుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. తాజాగా అక్కడి దారుణ వైద్య సేవలపై ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే వైరల్ కూడా అయ్యింది.చనిపోయిన శవాన్ని కూడా తరలించకుండా వదిలేసిన వైనం కనిపించింది. కరోనా టెస్టుల ఫలితాల కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. స్వయంగా మంత్రి నియోజకవర్గంలో ఇలాంటి దుస్థితి చూసి అందరూ ఏంటీ పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News