తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో 743 మంది సిబ్బంది కరోనా బారిన పడినట్టు అధికారికంగా ప్రకటన వెలువండింది. సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా... 743 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అయితే, వీరిలో ఇప్పటికే 400 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మిగతా వారు ఇంకా చికిత్స పొందుతున్నారు.
అయితే... ఇన్ని కేసులు వస్తున్నా దర్శనాలు కొనసాగించడంపై శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుల్లో ఆందోళన నెలకొంది. అర్చకులను కాపాడుకోవాలని... వారిలో ఎక్కువ మంది వృద్ధులున్నారని... మరికొంతకాలం దర్శనాలు ఆపితే మంచిదని అంటున్నారు. నిజానికి భక్తులు కూడా టీటీడీ అనుమతించిన దానికంటే తక్కువ మంది వస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
కింద తిరుపతిలో కూడా కరోనా విజృంభిస్తోంది. దీంతో భక్తులు ప్రయాణం సొంతంగా ఏర్పాటుచేసుకున్నా... ఆహార వసతి సదుపాయాల విషయంలో ఇబ్బంది పడుతున్నారు. టిటిడిలో సుమారు 22,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 9000 మందికి పైగా కోవిడ్ -19 పరీక్షలు చేశారు. వీరిలో 743 కేసులు బయటపడ్డాయి. అందరికీ టెస్టులు చేస్తే ఇంకా మరిన్ని తేలే అవకాశం ఉంది. పరిస్థితి అటువంటి భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, TTD దర్శనాన్ని ఆపడానికి ఇష్టపడటం లేదు. దీనిపై ప్రతిపక్షాలు ప్రపంచంలో అత్యంత సంపన్న దేవాలయాంలో డబ్బుల కొరత ఏముంది? భక్తులు, అర్చకులు, సిబ్బంది క్షేమం కోసమైనా దర్శనాలు ఆపడం మంచిదంటున్నారు.
అయితే ఈవో సింఘాల్ వీటిని ఖండించారు. టిటిడికి వస్తున్న ఆదాయం కంటే... కోవిడ్ సమయంలో ఖర్చే ఎక్కువ ఉందని అన్నారు. మేము ఆదాయం కోసం ఆలయాన్ని తెరవలేదని, భక్తుల కోరిక మేరకే తెరచి ఉంచామంటున్నారు. ఆయన చెప్పిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఒక్క భక్తుడికి కూడా కరోనా సోకలేదన్నారు. అయినా భక్తులు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. వారికి సోకలేదని ఈవో గారు ఎలా చెప్పగలరు?