అనుమతుల రద్దుపై ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల గగ్గోలు

Update: 2020-09-15 10:10 GMT
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ప్రైవేట్ కోవిడ్ సెంటర్ నిర్వాకం వల్ల 10 మంది అమాయకులు మరణించిన నేపథ్యంలో సర్కార్ అలెర్ట్ అయ్యింది. బెజవాడలోని ప్రైవేట్ కోవిడ్ సెంటర్లపై తాజాగా కొరఢా ఝలిపించింది. నిబంధనలు పాటించని ఆస్పత్రుల అనుమతులు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

స్వర్ణ ప్యాలెస్ ఘటన జరిగిన తర్వాత విజయవాడలోని 9 కోవిడ్ సెంటర్లకు ఇచ్చిన అనుమతులను నాడు రద్దు చేశారు. ఇప్పుడు మరికొన్ని ఆస్పత్రులకు చెక్ చెప్పారు.

అయితే అర్థాంతరంగా అనుమతులు రద్దు చేయడంపై ఆస్పత్రులు లబోదిబోమంటున్నాయట.. వాటికి అనుమతి ఇచ్చే సమయంలో లక్షలు చేతులు మారినట్టు భోగట్టా. ఇప్పుడు అనుమతులు రద్దుతో అవి గగ్గోలుపెడుతున్నాయి. అయితే అనుమతులు ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అయితే అనుమతులు రద్దు చేసిన ఆస్పత్రులన్నీ మళ్లీ ప్రజాప్రతినిధుల అండతో దరఖాస్తు చేసుకున్నాయనే టాక్ వినిపిస్తోంది.  ఒక ఆస్పత్రి కోసం ఏకంగా సీఎంవో నుంచే ఓ అధికారి సిఫారసు చేశారట.. ఇక మరో ఆస్పత్రి కోసం ఏకంగా ఇద్దరు అధికార ఎంపీలు మంత్రాంగం నడుపుతున్నారట.. ఇక ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే నేరుగా అధికారులకే ఫోన్లు చేస్తున్నారట..

ఈ క్రమంలోనే నిబంధనల ప్రకారం నడుచుకుంటే.. అన్నీ సక్రమంగా ఉంటేనే వాటికి అనుమతి ఇస్తామని కొత్త డీఎంహెచ్ వో చెబుతున్నారట.. ఒకసారి రద్దు చేశాక వెంటనే అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని కూడా చెబుతున్నారట.. ఈ దెబ్బకు ప్రైవేట్ కోవిడ్ సెంటర్లు అన్నీ తలపట్టుకుంటున్నాయని బెజవాడలో టాక్ నడుస్తోంది.
Tags:    

Similar News