భారత బయోటెక్. జనాల నోళ్లలో నానిన పేరు కాదు. ఇక.. క్రిష్ణా ఎల్లా. ఈ పేరు కూడా తెలుగు ప్రజలకు సుపరిచితమైనది కాదు. ఇక్కడ మా ఉద్దేశం.. ఒక రెడ్డి ఫార్మా మాదిరి.. ఒక అరబిందో మాదిరి భారత బయోటెక్ కు సాదాసీదా ప్రజలకు పెద్దగా తెలిసిన కంపెనీ కాదు. ఇండస్ట్రీలో వారికి మంచి పేరున్నా.. మాస్ ఇమేజ్ పెద్దగా లేదనే చెప్పాలి. పేపర్లు బాగా చదివే వారికి.. వార్తల్ని పక్కాగా ఫాలో అయ్యే వారికి..మీడియాలో ఒక సెక్షన్ వారికి మాత్రం భారత్ బయోటెక్ అన్నంతనే.. ఆ కంపెనీకున్న ఇమేజ్ బాగా తెలుసు.
అన్నింటికి మించిన రామోజీ రావు లాంటి పెద్ద మనిషి.. తన మనమరాలి పెళ్లిని ఎవరికిచ్చి చేస్తారన్న దానికి సమాధానంగా భారత్ బయోటెక్ సీఎండీ కుమారుడ్ని చూపించిన వైనం కొద్ది మందికే గుర్తు. ఇవన్నీ పక్కన పెడితే.. కరోనా పుణ్యమా అని.. ఆ కంపెనీ పేరుఇప్పుడు మారుమోగుతోంది.భారత్ బయోటెక్ అన్నంతనే కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో కీలకంగా మారటమే కాదు.. భారత్ వరకు చూస్తే.. ఇప్పుడు చాలామంది ఆశ ఆ కంపెనీ మీదనే.
దేశంలో కరోనా వ్యాక్సిన్ మీద గట్టిగా పని చేస్తున్న మూడు.. నాలుగు సంస్థలున్నా.. భారత్ బయోటెక్ మీద చాలా నమ్మకంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హ్యుమన్ ట్రయల్స్ కు వచ్చిన వీరి వ్యాక్సిన్ మీద సానుకూలతే నెలకొని ఉంది. అలాంటి ఆయన.. తాజాగా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ను అత్యంత నాణ్యతతో తీసుకురానున్నట్లు చెప్పారు. సురక్షితంగా ఉండేలా తీర్చిదిద్దుతామని.. ఈ విషయంలో ఒత్తిడి అన్న మాటను దగ్గరకు రానివ్వమని చెబుతున్నారు.
అన్నింటికి మించి కోవిడ్ 19 వ్యాక్సిన్ ను దేశ ప్రజలందరికి అందుబాటు ధరలో ఉండేలా తయారు చేస్తామన్న అభయం ఇస్తున్నారు. ఇన్ని మాటలు చెబుతున్న ఆయన.. వ్యాక్సిన్ వచ్చే డేట్ గురించి మాత్రం చెప్పలేకపోవటం గమనార్హం. చాలా త్వరగా తీసుకురావాలన్న ఒత్తిడి కంపెనీమీద ఉన్నా.. భద్రత.. నాణ్యత విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని.. అందుకే ఎప్పుడు తీసుకొస్తామన్న విషయం మీద క్లారిటీ ఇవ్వలేకపోతున్నట్లుగా మాత్రం తేల్చి చెబుతున్నారు. కోవిడ్ లాంటి క్లిష్టమైన వైరస్ మీద పని చేస్తున్నప్పుడు వ్యాక్సిన్ తయారీకి కటాఫ్ డేట్ పెట్టుకొని పని చేస్తే ఇబ్బందే. ఈ విషయంలో ఆ కంపెనీ స్టాండ్ ను మెచ్చుకోవాల్సిందే. ప్రజలు కోరుకుంటున్నారని.. నోటికొచ్చినట్లు చెప్పేసి.. కొత్త ఆశల్ని పుట్టించేలా కాకుండా.. రియలిస్టిక్ గా ఆయన మాటలు ఉండటం అభినందనీయమని చెప్పక తప్పదు.