కరోనా నుంచి రికవరీకి పట్టే రోజులెన్నీ.. వైరస్ రిపీట్ అవుతుంటుందా..దాని జీవితకాలమెంత..
అసలు కరోనా విషయంలో జననానికి లెక్క లేనన్ని సందేహాలు ఉన్నాయి. వైరస్ ఎలా వ్యాపిస్తుంది, వస్తే కోలుకోడానికి పట్టే సమయం ఎంత, ఏం తినాలి, ఇలా చాలా విషయాల్లో అందరికీ క్లారిటీ లేదు. జలుబు, దగ్గు, జ్వరం, నీరసం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, విరేచనాలు శ్వాసతీసుకోవడంలో సమస్య తదితరాలు కరోనా లక్షణాలు. వ్యాధి బారిన పడ్డవారు 14 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలి. అయితే కోలుకోవడానికి ఎన్నిరోజులు పడుతుందంటే మాత్రం ఒక్కొక్కరి విషయంలో ఒకలా ఉంటుంది.
వ్యక్తుల ఆరోగ్యం దీన్ని నిర్ణయిస్తుంది. సంపూర్ణ ఆరోగ్య వంతులు కరోనా బారిన పడితే వారికి ఉన్న ఇమ్యూనిటీ పవర్ కారణంగా వారు త్వరగా కోలుకుంటారు. బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు, ఆస్తమా, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారికి కరోనా సోకితే రికవరీకి సమయం మూడు నుంచి నాలుగు వారాలు పట్టే అవకాశం ఉంది. తేలిక పాటి లక్షణాలతో ఆస్పత్రి లో చేరిన వారికి ఆహారం, మందులు ఇస్తూ క్రమేణా కోలుకునేలా ట్రీట్మెంట్ ఇస్తారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉండి శ్వాసతీసుకోవడంలో సమస్య ఉంటే ఐసీయూలో కృత్రిమ శ్వాస అందిస్తారు. సీరియస్ కేసులకు నోటి ద్వారా విండ్ పైపులోకి గొట్టం పంపి దాని ద్వారా గాలి అందిస్తారు. కరోనా ప్రారంభ లక్షణాలకు 14 రోజులు పడుతుంది.
ఆసుపత్రిలో చేరి కోలుకున్న తర్వాత 24 గంటల పరిధిలో రెండుసార్లు శాంపిల్స్ సేకరిస్తారు. రెండు సార్లు కూడా నెగటివ్ ఫలితం వస్తే డిశ్చార్జి అవొచ్చు. ఒకసారి కరోనా బారిన పడ్డ వారి ఒంట్లో వైరస్ ఎన్ని రోజుల పాటు జీవించి ఉంటుందనే విషయం పై క్లారిటీ లేదు. వైరస్ బారినపడి కోరుకున్న వారికి రోగనిరోధక శక్తి పూర్తి స్థాయి లో ఉంటుందో లేదో కచ్చితం గా చెప్పలేం. ఒకసారి కరోనా సోకి కోలుకున్న తర్వాత.. మళ్లీ ఎంత కాలానికి వైరస్ బారిన పడతాం.. అనే విషయం పట్ల ఎవరికి పూర్తి గా అవగాహన లేదు.