భారత్ లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. శీతాకాలం మొదలు కావడంతో రెండో వేవ్ మొదలైనట్టే కనిపిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 50357 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో భారత్ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 84,62,081కి చేరింది.
ఇప్పటిదాకా భారత్ లో 78.19 లక్షల మంది కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 5.16 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో భారత్లో 577మంది కరోనాతో మృతిచెందారు. దీంతో భారత్ లో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,25,562కి చేరింది. 24 గంటల్లో 53920మంది కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
నిన్న 47వేల కేసులు నమోదుకాగా.. ఈరోజు 50వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
*తెలంగాణలో కొత్తగా 1,607 కరోనా కేసులు
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,607 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,48,891 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,372గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,27,583 మంది కోలుకోగా ప్రస్తుతం 19,936 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 17,134 మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 296 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మరణాల రేటు 0.55 శాతం ఉండగా రికవరీ రేటు 91.43 శాతంగా ఉంది.
ఇక ఏపీలో కూడా తీవ్రత పెరుగుతోంది. కేసుల సంఖ్య 5వేలకు చేరువ అవుతోంది. కరోనా తీవ్రత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.