భారతదేశంలో కరోనా మహమ్మారి జోరు మళ్లీ రోజురోజుకి పెరిగిపోతుంది. గత కొన్ని రోజులుగా 50 వేలకి తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ , ఒకరోజు తక్కువ కేసులు,మరో రోజు భారీగా నమోదు అవుతున్నాయి. ఇక కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 45,903 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,07,754 కి చేరింది.
అలాగే , ఇక గత 24 గంటల్లో 48,405 మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల సమయంలో 490 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,26,611 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 79,17,373 మంది కోలుకున్నారు. 5,09,673 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్ లలో చికిత్స అందుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా వచ్చిన ప్రతి 100 మందిలో ఒకరు లేదా ఇద్దరు చనిపోతున్నారు. ప్రపంచ దేశాల్లో ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతున్నారు. నిన్న దేశంలో కొత్తగా 8,35,401 టెస్టులు మాత్రమే చేశారు. మొన్నటి కంటే అవి 3,59,086 తక్కువ. మొత్తం టెస్టుల సంఖ్య 11,85,72,192కి చేరింది. టెస్టుల సంఖ్య పెరిగేకొద్ది కొత్త కేసులూ పెరుగుతున్నాయి.
ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, పోలాండ్... టాప్ 5లో ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... ఇండియా, మెక్సికో, ఇరాన్, ఇటలీ తర్వాతి పొజిషన్‌లో ఉన్నాయి.
న్యూయార్క్ టైమ్స్ గణాంకాల మేరకు గడచిన 24 గంటల వ్యవధిలో 1.26 లక్షలకు పైగా కొత్త కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 1,00,51,300కు చేరింది. గత ఏడు రోజులుగా రోజుకు సగటున లక్షకు పైగా కేసులు అమెరికాలో నమోదవుతుండటం గమనార్హం. ఇక, కేసులు అధికంగా ఉన్నాయని భావిస్తున్న ఇండియా, ఫ్రాన్స్ లతో పోలిస్తే, 29 శాతం కేసులు అమెరికాలోనే కొత్తగా వస్తున్నాయి.ఇటీవలి కాలంలో రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య 10 మిలియన్ మార్క్ ను అధిగమించింది. గడచిన పది రోజుల్లోనే యూఎస్ లో పది లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి.