కరోనా వ్యాక్సిన్ కోసం వేగంగా తీసుకొచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు ముమ్మరయత్నాలు చేస్తున్నాయి. రష్యా, చైనా లాంటి దేశాలు హడావుడిగా వ్యాక్సిన్లు తీసుకొచ్చినప్పటికీ అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రపంచం దృష్టంతా అమెరికాకు తీసుకొస్తున్న వ్యాక్సిన్ పైనే నెలకొన్నది. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ‘ఫైజర్’ తాము తయారు చేసిన వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తాజాగా ప్రకటించింది. అయితే ఈ వ్యాక్సిన్ అత్యుత్తమమైనదని నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం చివరిదశ ట్రయల్స్ నిర్వహిస్తున్న ఈ వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.
అయితే ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి విడుదలైతే భారతప్రజలకు అందుబాటులో ఉంటుందా? దాని ధర ఎంత అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. జర్మనీకి చెందిన ‘బయోఎన్‌టెక్’ కంపెనీతో కలిసి అమెరికా ఫైజర్ కంపెనీ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నది. ప్రస్తుతం చివరి ట్రయల్స్‌లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 44 వేల మంది వాలంటీర్లను ఎంపిక చేశారు. అంతిమంగా వారిలో 22 వేల మందికి వ్యాక్సిన్ ఇస్తారు. మరో 22వేల మందికి ‘ప్లేస్‌బో ( ఉత్తుత్తి మందు)’ ఇస్తారు. ఎవరికి ఏది ఇచ్చారో చెప్పరు? ఆ తర్వాత రోగ నిరోధక శక్తి పెరిగిందా పెరిగిన తీరుపై అంచనా వేస్తారు. తొలి ప్రాథమిక ట్రయల్స్‌లో భాగంగా, 32 మంది వాలంటీర్లపై, రెండో ప్రాథమిక ట్రయల్స్‌లో భాగంగా 62 మంది, మూడవ ట్రయల్స్‌లో భాగంగా 92 మందిపై, నాలుగవ ట్రయల్స్‌లో భాగంగా మొత్తం 120 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్‌ను ప్రయోగించగా, 90 శాతం సక్సెస్ ఫలితాలు వచ్చాయి. తాము ఎంపిక చేసిన వాలంటీర్ల సంఖ్యను బట్టి మరో విడత 164 మంది వాలంటీర్లపై ట్రయల్స్‌కు ఆ కంపెనీలు సిద్ధమయ్యాయి.
మొత్తం అందరి మీద వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తయ్యాక వాలంటీర్లలో ప్రతికూల మార్పులతోపాటు సానుకూల మార్పుల డేటాను లైసెన్స్ అనుమతి యంత్రాంగానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం అమెరికా ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ నవంబర్ చివరి వరకు ఫైజర్ కంపెనీకి సమయం ఇచ్చింది.
ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయని వైద్య శాస్త్రవేత్త గగన్‌దీప్ కాంగ్ మీడియాకు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ కూడా ఈ స్థాయిలో మెరుగైన ఫలితాలు కనబరచలేదని చెప్పారు. అమెరికాలోనే ఈ వ్యాక్సిన్ డోస్‌కు 37 డాలర్లు (దాదాపు 2,750 రూపాయలు) పలుకుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే భారత్‌కు వచ్చే వరకు ఈ ధర పెరగవచ్చని చెబుతున్నారు. అయితే ఇప్పట్లో ఈ వ్యాక్సిన్ భారత్‌కు వచ్చే అవకాశం లేదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్‌ను ఆర్‌ఎన్‌ఏ (రైబోన్యూక్లియక్ ఆసిడ్)తో తయారు చేశారని, అలాంటి వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చే వ్యవస్థ ఇప్పటి వరకు భారత్‌లో లేదని, కేవలం డీఎన్‌ఏ (డీయాక్సియోరైబో న్యూక్లియక్ ఆసిడ్) నుంచి తయారు చేసిన వ్యాక్సిన్లకే భారత్‌లో అనుమతి ఉందని ప్రొఫెసర్ గగన్‌దీప్ వివరించారు. ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ డోస్‌ను ఎల్లప్పుడు మైనస్ 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చాల్సి ఉంటుందని, అలాంటి వ్యవస్థ భారత్ ల్యాబుల్లో, ఆస్పత్రుల్లో లేదని ఆమె వివరించారు.