కరోనా విజృంభణ : ఒక్కరోజే 9,860 మరణాలు!

Update: 2020-11-14 06:00 GMT
కరోనా వైరస్ మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్ తో సహా కొన్ని దేశాల్లో  కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతూనే ఉంది. కానీ, కరోనా ప్రభావం తగ్గిపోయింది అని అనుకోని చాలా దేశాల్లో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. అసలు కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయింది అనుకోని ఏ మాత్రం నింబంధనలు పాటించడం లేదు. కరోనా కేసులు ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.  కొన్ని దేశాల్లో కరోనా తగ్గుముఖం పట్టినా, యూరప్ లో రెండోదశ కరోనా విజృంభిస్తోంది.  ఇక అమెరికాలోనైతే చెప్పాల్సిన అవసరం లేదు.  ఎన్నికల తరువాత ఆ దేశంలో రోజు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  

గత 24 గంటల్లో  ప్రపంచవ్యాప్తంగా 6,45,661 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ప్రపంచం మొత్తం మీద నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,37,21,389కి చేరింది.  ఇక నిన్న ఒక్కరోజు కరోనాతో 9860 మంది మరణించారు.  దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,08,483కి చేరింది.  ఇక అమెరికాలో నిన్న ఒక్కరోజులో 1,77,772 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో అమెరికాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,58,308కి చేరింది. కరోనాతో నిన్న ఒక్కరోజులో 1365 మంది మరణించారు.  దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 2,49,945కి చేరింది.

భారత్ లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 44,684 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 87,73,479 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 47,992మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 520 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,29,188 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 81,63,572 మంది కోలుకున్నారు. 4,80,719 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 12,40,31,230 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు  ఐసీఎంఆర్ తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,29,491 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Tags:    

Similar News