మాస్కు లేకుండా బయటకొస్తే జేబుకు చిల్లే.. ఆ రాష్ట్రంలో కఠిన ఆంక్షలు అమలు
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గిపోయి క్రమంగా ఆంక్షలు సడలిస్తూ వస్తుండగా.. దేశరాజధాని ఢిల్లీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అన్ని రాష్ట్రాలలో రోజుకు వందల్లోనే కేసులు నమోదు అవుతుండగా, ఒకటో రెండో మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం రోజుకు పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో కఠిన ఆంక్షలు ఎందుకు విధించలేదని ఢిల్లీ హైకోర్టు కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చారు.
మాస్కు ధరించకుండా ఎవరైనా బయటికి వస్తే రూ.రెండు వేల జరిమానా విధించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గతంలో మాస్కు ధరించని వారికి రూ. 500 జరిమానా విధిస్తుండగా, పోలీసులు అది కూడా నామమాత్రంగా ప్రజల నుంచి జరిమానా విధించే వారు. ఇకపై మాస్కులు ధరించని వారికి తప్పనిసరిగా రూ. 2 వేల జరిమానా విధించాలని కేజ్రీవాల్ సర్కారు అధికారులకు ఆదేశించింది. దీనికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆమోదం అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
మాస్కు ధారణ ఒకటే కాదు.. భౌతిక దూరం పాటించకపోయినా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, పొగాకు వినియోగించినా రూ.2 వేల జరిమానా విధించనున్నారు. ఢిల్లీలో కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే అక్కడ 6608 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏకంగా 118 మంది వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు.
ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5.17 లక్షలకు చేరింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు ఢిల్లీలో 8వేల మంది మరణించారు. ప్రస్తుతం దేశ రాజధానిలో 40,936 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 90,21,020 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా 84,43,553 మంది చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా తో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,32,310 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 4,43,124 యాక్టివ్ కేసులున్నాయి.