కరోనా కల్లోలం..దేశంలో ఒక రోజే 152 మంది మృతి - ఎన్ని కేసులంటే!

Update: 2021-01-23 06:50 GMT
భారతదేశంలో కరోనా మహమ్మారి జోరు రోజురోజుకి తగ్గుతూ వస్తుంది. గతంలో రోజు లక్షకి పైగా కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదు అయ్యాయి. అయితే , ఈ మధ్య కరోనా పోసిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. మన దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 14,256 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మహమ్మారి కారణంగా 152 మంది ప్రాణాలు కోల్పోయారు.

17,130 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,06,39,684కి చేరుకుంది. మొత్తం 1,53,184 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,03,00,838 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,85,662 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 13,90,592 మందికి వ్యాక్సిన్ వేశారు. అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తొలి దశలో హెల్త్ కేర్ వర్కర్లు కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. త్వరలో ప్రజలకు సైతం వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభం కానుంది.  నవరి 16న మొదలైన టీకాల పంపిణీకి శుక్రవారంతో వారం రోజులు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం వారంలోనే దాదాపు 14 లక్షల మందికి టీకాలు వేశారు. ఈ వారంలోనే  13,90,592 మందికి టీకాలు వేసింది మన ప్రభుత్వం. ఆరు రోజుల్లోనే పది లక్షల మార్కును దాటింది. అంటే గురువారం నాటికే 10.4 లక్షల మందికి టీకాలు పడ్డాయి. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,47,058 మందికి టీకాలు వేశారు. ఏ విధంగా చూసినా ఇది ఒక రికార్డే. టీకా పంపిణీ మనకన్నా ముందే ప్రారంభమైన మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర చాలా వేగంగా జరుగుతోంది.
Tags:    

Similar News