కరోనా కలకలం..24 గంటల్లో 62,258 మందికి పాజిటివ్!

Update: 2021-03-27 07:17 GMT
దేశంలో మూడు రకాల కొత్త కరోనా స్ట్రెయిన్లు జోరుగా వ్యాపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే మళ్లీ గతేడాది పరిస్థితులు వస్తాయంటున్నారు నిపుణులు. ఇండియాలో కొత్తగా 62,258 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 1,19,08,910కి చేరింది. కొత్తగా 291 మంది కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1,61,240 అయ్యింది. మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 30,386 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,12,95,023కి చేరింది. రికవరీ రేటు 94.8 శాతంగా ఉంది. ప్రస్తుతం కేరళ, లక్షద్వీప్ తప్ప... మిగతా అన్ని రాష్ట్రాలు - కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరిగాయి. మహారాష్ట్ర - కర్ణాటక - పంజాబ్ - ఛత్తీస్‌ గఢ్ - ఢిల్లీ - ఆంధ్రప్రదేశ్ - గుజరాత్ - హర్యానా - మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - తమిళనాడు - ఉత్తరప్రదేశ్‌ లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 58,029 టెస్టులు చెయ్యగా 495 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,05,804కి చేరింది. కొత్తగా కరోనాతో ఇద్దరు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1,685కి చేరింది. మరణాల రేటు 0.55 శాతం ఉంది. తాజాగా 247 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 2,99,878కి చేరింది. రికవరీ రేటు 98.06 శాతానికి చేరింది. ప్రస్తుతం 4,241 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో కొత్తగా 40,604 టెస్టులు చెయ్యగా... 984 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,96,863కి చేరింది. కొత్తగా చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో చెరొకరు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 7,203కి చేరింది. కొత్తగా 306 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 8,85,515కి చేరింది. ప్రస్తుతం 4,145 యాక్టివ్‌ కేసులున్నాయి.

ప్రపంచదేశాల్లో కొత్తగా 6,12,147 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 12.66 కోట్లు దాటింది. కొత్తగా 11,251 మంది చనిపోవడంతో  మొత్తం మరణాల సంఖ్య 27.78 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.17 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారు. అమెరికాలో కొత్తగా 73,742 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3.08 కోట్లు దాటింది. కొత్తగా 1,214 మంది చనిపోవడంతో  మొత్తం మరణాల సంఖ్య 5.61 లక్షలు దాటింది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో ఉంది. బ్రెజిల్ - ఇండియా - రష్యా - ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో బ్రెజిల్ టాప్‌‌ లో ఉండగా... అమెరికా - ఇండియా - ఫ్రాన్స్ - పోలాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచ మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌ లో ఉంది.
Tags:    

Similar News