దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతవారం పోల్చితో పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అయింది. రెండో దశలో భాగంగా భారత్పై మహమ్మారి పంజా విసిరింది. బాధితుల్లో చిన్నారులు సైతం ఉన్నారు. రానున్న రోజుల్లో వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదముందని ఆరోగ్య శాఖ నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు.
రెండో దశ గుప్పిట్లో
దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని హెచ్చరించారు. కొన్ని జిల్లాల్లో రెట్టింపు కేసులు నమోదవుతున్నాయని అన్నారు. ఇప్పుడు కరోనా రెండో దశ గుప్పిట్లో భారత్ ఉందని.. నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. వైరస్ను రోజురోజుకూ కొత్త వేరియంట్లతో విశ్వరూపం చూపిస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా మరోసారి కోరలు చాచే అవకాశం ఉందని... కచ్చితంగా కరోనా నిబంధనలు పాటింటి మహమ్మారి బారిన పడకుండా రక్షించుకోవాలని సూచించారు.
ధైర్యంగా ఉండాలి
కొవిడ్ను ఎదుర్కోవడానికి ఇప్పటికే వ్యాక్సిన్లూ వచ్చినప్పటికీ భౌతిక దూరం, మాస్కు ధరించడం వంటి కనీస నిబంధనలు పాటించకపోతే పెద్ద ప్రమాదం తలెత్తుతుందని ఆయన హెచ్చరించారు. నిబంధనలు గాలికొదిలేస్తే పరిస్థితి తీవ్రమవుతుందని అభిప్రాయపడ్డారు. ఏ మూలన ఉన్నా వైరస్ సోకే ప్రమాదం ఉందని... మహమ్మారిని ఎదుర్కొవడానికి మానసిక ధైర్యంగా ఉండాలని సూచించారు.
మహారాష్ట్ర మొదటిస్థానం
దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 జిల్లాల్లో గరిష్ఠ స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు. వాటిలో 8 జిల్లాలు మహారాష్ట్రలోనే ఉండడం గమనార్హమని అన్నారు. వీటిలో పుణెలో 59 వేలకు పైగా కేసులు నమోదవుతున్నట్లు వెల్లడించారు. తర్వాత ముంబయి, నాగపూర్, థానే, నాసిక్, ఔరంగాబాద్, బెంగుళూరు అర్బన్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అయిందని అన్నారు. అప్పటి నుంచి రోజుకు 3వేల కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ఇక వారంరోజుల్లోనే పాజిటివిటీ రేటు 23 శాతానికి పైబడిందని తెలిపారు. ఇక 47 జిల్లాల్లో పరీక్షలను పెంచినట్లు వెల్లడించారు.
చర్యలు పటిష్ఠం చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ చర్యలను మరింత పటిష్ఠం చేయాలని, ప్రజారోగ్యం దృష్ట్యా వెంటనే అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్సాక్సినేషన్ కార్యక్రమం మొదలైనా నిర్లక్ష్యం తప్పదని హెచ్చరించారు. పని ప్రదేశాల్లో ఏమాత్రం అజాగ్రత్త వహించకుండా నిబంధనలు పాటించాలని.. అవసరమైతే తప్పా బయటకు వెళ్లకుండా ఉండాలని ఆరోగ్య శాఖ నిపుణులు సూచిస్తున్నారు.