దేశంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. దీనితో దేశంలోని చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూల దిశగా అడుగులు వేస్తున్నాయి. మరోసారి లాక్ డౌన్ ఉండదు అని కేంద్రం చెప్పినా... రాష్ట్రాల్లో కర్ఫ్యూ తరహా నిర్ణయాలు మళ్లీ వలస కార్మికులకు సమస్యగా మారుతున్నాయి. అదే సమయంలో దేశంలో కరోనా కేసులు కూడా బాగా పెరుగుతున్నాయి. భారత్ లో కొత్తగా 1,31,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 62,899 మంది కోలుకోగా... 780 మంది మరణించారు. ప్రస్తుతం 9,79,608 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదిలా ఉంటే .. మహారాష్ట్రలో కొత్తగా 56,286 కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్ గఢ్ లో 10,652, ఢిల్లీలో 7437, కర్నాటకలో 6570, మధ్యప్రదేశ్ లో 4324, కేరళలో 4353, గుజరాత్ లో 4031 మంది కరోనా బారినపడ్డారు. దేశంలో కొత్తగా 13,64,205 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు 25 కోట్ల 40లక్షల 41 వేల584 టెస్టులు జరిగాయి. ఇండియాలో నిన్న 36,91,511 వ్యాక్సిన్లు ఇవ్వగా , మొత్తం వేసిన టీకాల సంఖ్య 9,43,34,262కి చేరింది.
ఇక , తెలంగాణలో కొత్తగా 2,478 కొత్త కరోనా కేసులు వచ్చాయి. ఇప్పటివరకు 3,21,182 కేసులు నమోదయ్యాయి. కొత్తగా కరోనా నుంచి 363 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,03,964కి చేరింది. కొత్తగా ఐదుగురు కన్నుమూశారు. మొత్తం మరణాల సంఖ్య 1746కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 15,472 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 9,674 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. GHMC పరిధిలో కొత్తగా 402 కేసులు వచ్చాయి. తెలంగాణలో కొత్తగా 1,01,986 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య కోటి 7లక్షల 61వేల 939కి చేరింది. తెలంగాణలో ప్రతి 10 లక్షల మందిలో 2,89,143 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా 31,892 టెస్టులు చెయ్యగా... 2,765 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 496, గుంటూరు జిల్లాలో 490, కృష్ణాజిల్లాలో 341, విశాఖపట్నం జిల్లాలో 335, నెల్లూరు జిల్లాలో 292 పాజిటివ్ కేసులు నమోదవగా.. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9,18,597కి చేరింది. కొత్తగా 11మంది మృతి చెందగా.., మొత్తం మరణాల సంఖ్య 7,279కి చేరింది. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులతోపాటూ మరణాలూ పెరుగుతున్నాయి. నిన్న కొత్తగా 7,72,510 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 13.52 కోట్లు దాటింది. నిన్న 13,077 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 29.27 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2.35 కోట్లు ఉన్నాయి