దేశంలో కరోనా విలయం కొనసాగుతుంది. దేశంలో రోజు రోజుకు మహమ్మారి తీవ్రత భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నిన్న 3లక్షలకుపైగా కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. శుక్రవారం వరుసగా రెండోసారి 3లక్షలకుపైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,32,730 కరోనా కేసులు నమోదయ్యాయని, 2,263 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 1,93,279 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,63,695కు చేరగా.. ఇప్పటి వరకు 1,36,48,159 మంది కోలుకున్నారు. మొత్తం మహమ్మారి బారినపడి 1,86,920 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో 24,28,616 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. మరో వైపు టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటి వరకు 13,54,78,420 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ఓ వైపు టీకా డ్రైవ్ కొనసాగుతుండగా ,రోజువారీ కొవిడ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇదిలా ఉంటే ... తెలంగాణలో కరోనా అలజడి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో 6,206 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారంహెల్త్ బులిటెన్ లో తెలిపింది. తాజాగా 29 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వైరస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,928కి చేరింది. అలాగే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.79 లక్షలకి చేరింది. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒకే రోజు 1,05,602 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాటాయి. 24 గంటల్లో 1,005 కరోనా కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది.