దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఓ రేంజ్ లో విజృంభిస్తుంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్కరోజులో ఏ దేశంలో నమోదు కానటువంటి పాజిటివ్ కేసులు ఇండియా లో నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ దొరకడం లేదు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే , దీనిపై హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు మాట్లాడుతూ .. అనవసరం అయిన వారు కూడా ఆక్సిజన్ కోసం వస్తుండటం వలనే అవసరం అయిన వారికి సరైన సమయంలో ఆక్సిజన్ అందక మృతి చెందుతున్నారు అని అన్నారు. ఈ సమయంలో ఎక్కువగా రెమిడెసివిర్, తుసిలిజు మాబ్ కోసం ఎగబడుతున్నారు. అయితే , ఆ డోస్ తో కరోనా కి దూరం కావచ్చు అని నమ్మకం పూర్తిగా అవివేకం అని అంటున్నారు. యాంటీ వైరల్ డ్రగ్స్‌తో ప్రాణాలు నిలపడం సాధ్యం కాదని, వాటిని వాడాల్సిన అవసరమే లేదని తేల్చి చెప్పారు.
కరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్ అవసరం పడదు. అనేక మంది భయాందోళనతో అనవసరం గా వాడుతున్నారు. మా వద్దకు వచ్చే రోగుల్లో 30 శాతం మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వస్తున్నారని ,శాచురేషన్ లెవెల్స్ 85 శాతం కంటే తక్కువగా ఉంటే అత్యంత విషమమైన పరి స్థితుల్లో రోగి ఉన్నట్లు లెక్క. 85–89 మధ్య ఉంటే విషమం, 90–93 శాతం శాచురేషన్ ఉంటే మధ్య స్థాయి, 93–95 వరకు ఉంటే మైల్డ్ గా ఉన్నట్లు లెక్క. 95 అంతకంటే ఎక్కువగా శ్యాచురేషన్ ఉంటే సాధారణం కింద లెక్క. కానీ శాచురేషన్ స్థాయి 100 శాతం రావడంలేదని, 95 మాత్రమే ఉందని.. ఆక్సిజన్ పెట్టాలని అనేక మంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారని అన్నారు. గాంధీలో వెంటిలేటర్ పై ఉన్న వారిలో 30 శాతం మంది యువకులే ఉన్నారు. అంటే 30–45 ఏళ్ల వయస్సు వారే. సెకండ్ వేవ్ లో యువకులు కూడా ఎక్కువగా వైరస్ బారినపడుతున్నారు. ఇక గతం కంటే ఇప్పుడు డాక్టర్లు ఎక్కువగా వైరస్‌కు గురవుతున్నారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద్దలకు సోకుతోంది. పిల్లలకు వైరస్ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారు.
కరోనా లక్షణాలను బట్టే చికిత్స ఉంటుంది. సాధారణ కేసుల్లో డాక్టర్ సూచనల మేరకు మందులు వాడితే సరిపోతుంది. సీరియస్ కేసుల్లో స్టెరాయిడ్స్, యాంటీ ప్లేట్‌లెట్ డ్రగ్స్, యాంటీ కోయాగ్లెన్స్ మందులు అవసరాన్ని బట్టి వాడాలి అని అన్నారు. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ట్రిపుల్ మ్యుటేషన్ రాష్ట్రంలో గుర్తించలేదు. డబుల్ మ్యుటెంట్ వైరస్‌లైతే ఉన్నాయి. దీంతో వైరస్ ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉంది. కుటుంబంలో ఒకరికి వస్తే ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. దీంతో చాలామంది వైరస్ బారిన పడుతున్నారు. వందలో 80 మందికి ఇంట్లోనే రికవరీ అవుతుంది. మిగిలిన వారిలో ఐదుగురికి మాత్రమే ఆక్సిజన్ అవసరం పడుతుంది. మూడు వారాల్లో వైరస్ తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నాం అని అన్నారు. ముక్కు, నోరు పూర్తిగా మూసుకునేలా మాస్క్ పెట్టుకోవాలి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఏ కంపెనీ వ్యాక్సిన్ అని చూడకుండా ఏది అందుబాటులో ఉంటే దాన్ని వేసుకోవాలి అని అన్నారు.