దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. వరుసగా మూడో రోజు కూడా దేశంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. రోజువారీ కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ రికార్డ్ సృష్టించింది. దేశంలో కొత్తగా 3.46 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 2,620 మంది మృతి మరణించారు. ఇక, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 25,43,914 కరోనా యాక్టివ్ కేసులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 1,89,549 మంది చనిపోయారు. ఇక దేశంలో ప్రతి గంటకు 14,373 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. కరోనాతో గంటకు 109 మంది ప్రాణాలను కోల్పోతున్నారు.
ఇకపోతే , ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 24 గంటల్లో 773 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 348 మంది చనిపోయారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 66,836 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 24331 కేసులు నమోదయ్యాయి. భారత్ లో ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసులు మాత్రమే వెల్లడిస్తున్నా పరిస్థితులు అంతకంటే దారుణంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ కఠినమైన లాక్ డౌన్ లు విధించడం, మాస్క్ లు తప్పనిసరిగా ఉపయోగించడం, భారీ సమూహాలను నిషేధించడం, అంతర్రాష్ట్ర రాకపోకలను నియంత్రించడం, వ్యాక్సినేషన్ పెంచడం ద్వారా గణాంకాలను తగ్గించవచని మిషిగన్ యూనివర్సిటీ అభిప్రాయపడింది. కరోనా రెండో ఉద్ధృతి వచ్చే నెల 11-15 మధ్య తారాస్థాయికి చేరవచ్చని కాన్పుర్, హైదరాబాద్ ఐఐటీ శాస్త్రవేత్తలు రూపొందించిన గణిత నమూనా వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే.. బ్రెజిల్‌లో గురువారం 79,719 కేసులు రికార్డు అయ్యాయి. అమెరికాలో 62,642 కేసులు, టర్కీలో 54,791 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీని బట్టి చూస్తే, భారత దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయంగా నమోదైన మొత్తం 8.90 లక్షల కేసుల్లో 37 శాతం భారతదేశంలోనే నమోదు కావడం విశేషం.భారత్‌లో మే ప్రథమార్ధంలో గరిష్ఠ స్థాయికి చేరుతుందని మిషిగన్ యూనివర్సిటీ సంచలన నివేదిక వెల్లడించింది. అప్పటికల్లా ప్రభుత్వపరంగా వెల్లడించే రోజువారీ కేసుల సంఖ్య 10 లక్షలకు, మరణాలు 5వేలకు చేరే అవకాశం ఉందని ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’ అంచనా వేసింది.
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల మధ్య 7,432 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 2,157 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,87,106కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,26,997 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,961గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 58,148 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,464 మందికి కరోనా సోకింది.