ఏ కరోనా వల్ల అయితే.. తన పేరుకు డ్యామేజీ అయిన పరిస్థితి వచ్చిందో.. అదే కరోనాను అడ్డుపెట్టుకుని ప్రధాన మంత్రి నరేంద్రమో డీ.. పుంజుకునేందుకు రెడీ అయ్యారు. భారీ ఎత్తున దేశంలో జాతర మాదిరిగా ఆయన కరోనా వ్యాక్సిన్ పండగను నిర్వహించను న్నారు. దీనికి సోమవారమే(జూన్ 21) ముహూర్తం కావడం గమనార్హం. కరోనా తొలిదశ వెలుగు చూడగానే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించి.. వ్యాప్తిని అదుపు చేసిన మోడీ.. రెండోదశకు వచ్చే సరికి ఆర్థిక లెక్కలు వేసుకుని.. భారాన్ని రాష్ట్రాలపైనే వదిలేశారు.
దీంతో రాష్ట్రాలు ఆలోచించి నిర్ణయం తీసుకునేలోపే రోజుకు వేలాది మంది కరోనా బాధితులు మృతి చెందారు. ఈ పరిణామం.. మోడీకి బాగానే సెగరగిలించింది. మరోవైపు.. దేశంలో సెకండ్ వేవ్ పొంచిఉందని.. నిపుణులు హెచ్చరిస్తున్నా.. పెడచెవిన పెట్టారనే.. విమర్శలు కూడా మోడీని చుట్టుముట్టాయి. దేశంలో తయారైన వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇవ్వకుండా ఆయన విదేశాలకు పంపించారు. తద్వారా ప్రపంచ స్థాయిలో తనను తాను హీరోగా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారని కూడా విమర్శ లు వెల్లువెత్తాయి.
అంతర్జాతీయ మీడియాలోనూ మోడీ ప్రభ సన్నగిల్లింది. ఆత్మనిర్భర్ భారత్ వంటి ప్రకటనలు మూగబోయా యి. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు సహా.. బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోడీని చెరిగేశారు. ఈ పరిణామాలతో ఉక్కిరికి బిక్కిరి అవుతున్న మోడీ సర్కారుపై సుప్రీంకోర్టు.. తనంతటతానుగా స్వీకరించిన కేసు.. మరింత శరాఘాతంగా మారింది. వ్యాక్సిన్ లభ్యత, పంపిణీ, రాష్ట్రాలకు విక్రయించడం, ధరల్లో వ్యత్యాసం.. ఇలా.. అనేక కోణాల్లో సుప్రీం కోర్టు తలంటేసింది.
దీంతో బొప్పికట్టిన మోడీ.. ఎట్టకేలకు దిగివచ్చి.. దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ అందించేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 21 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు స్వయంగా ప్రకటించారు. అయితే.. దీనిని ప్రజారోగ్యం కోణంలో కాకుండా.. ప్రచార కోణంలో చూస్తుండడమే ఇప్పుడు మోడీపై సటైర్లు పేలేలా చేస్తోంది. ప్రజల సొమ్ముతో ఇస్తున్న వ్యాక్సిన్‌ను ఆయన ప్రచారం కోసం వాడుతున్నారని.. ఎయిమ్స్‌కు చెందిన మాజీ వైద్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. మరి.. ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తారో.. ప్రజలకు ప్రాధాన్యం ఇస్తారో చూడాలి.