పక్క రాష్ట్రం కర్ణాటకలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. పరిస్థితి కల్లోలంగా మారింది. ఇవాళ ఒక్కరోజే కర్ణాటకలో 2496 పాజిటివ్ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కర్ణాటకలో మొత్తం కేసుల సంఖ్య 44077కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 25839గా ఉంది.
ఇక కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరులో కరోనా తీవ్రత ఆందోళనకర స్థితిలో ఉంది. అందుకే తాజాగా అక్కడ వీకెండ్ లో లాక్ డౌన్ విధిస్తున్నారు.ఒక్క బెంగళూరులోనే మొత్తం 2496 కేసుల్లో 1267 నమోదయ్యాయి. తీవ్రత బాగా ఉంది.
ఇక కర్ణాటకలో మరణాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 87మంది చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో 56మరణాలు బెంగళూరులోనే కావడం గమనార్హం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 842కి చేరింది.
కర్ణాటకలో కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. జూలై 15 నుంచి అంటే నేటి నుంచి 21వరకు బెంగళూరులో షట్ డౌన్ విధించింది.