ముంబైలో కలకలం: 70మంది వైరస్ బాధితులు అదృశ్యం

Update: 2020-06-24 07:15 GMT
మహారాష్ట్రలో ఇప్పటికే కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఒక్క రాష్ట్రంలోనే లక్ష యాభై వేలకు కేసులు చేరుకుంటున్నాయి. ఇక రాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే ముంబైలో 70వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు ముంబైలో ఓ వార్త కలకలం రేపుతోంది. ఏకంగా 70 మంది వైరస్ బారిన పడిన రోగులు అదృశ్యమయ్యారు. దీంతో ఒక్కసారిగా ముంబై ఉలిక్కిపడింది. ఈ విషయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్ ప్రకటించింది.  

రికార్డుల్లో ఉన్న 70 మంది వైరస్ బాధితులు కనిపించడం లేదని తెలిపింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కనిపించకుండా పోయిన 70 మంది రోగుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే వారి ఆచూకీ కనిపించకపోవడానికి కారణం బాధితులు తప్పుడు చిరునామా, ఫోన్ నంబర్లు ఇచ్చారంట. అందుకే వారి ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. వారంతా ఉత్తర ముంబైలోని మలాడ్ ప్రాంతానికి చెందినవారని సమాచారం. ముంబైలో అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో మలాడ్ కూడా ఒకటి. అయితే తప్పిపోయిన రోగులకు సంబంధించిన బంధువుల ద్వారా వారి చిరునామాను సేకరించే ప్రయత్నం లో ఉన్నారు. అయితే వారెందుకు అదృశ్య మయ్యారో తెలియడం లేదు. ఆస్పత్రి లో వైద్య సేవలు బాగా లేకన లేకపోతే.. ఆస్పత్రి లో ఉండ లేక ఇలా చేశారో తెలియడం లేదు. వారు వైరస్ తో బాధపడుతున్నారు ఈ సమయంలో బాహాటంగా బయట తిరిగితే పెను ప్రమాదం. ఇతరులకు కూడా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News