ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 మినీ వేలం ఇటీవల ముగిసింది. ప్రస్తుతం ఈ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్, వేదికల గురించి చర్చ మొదలైంది. కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్న క్రమంలో గత ఏడాది ఆటగాళ్ల ఆరోగ్యం కోసం యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 నిర్వహించడం తెలిసిందే. అయితే ఈసారి ఇండియా లో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ గట్టి పట్టుదలతో ఉంది. మొదటగా ముంబై లో వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్, రిలయన్స్ వంటి అధునాతన స్టేడియాలు అందుబాటులో ఉండటం తో ఆ తటస్థ వేదికల్లో ఈ సీజన్ జరపాలని అనుకున్నారు. కానీ , ముంబైలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది.
దీనితో బీసీసీఐ మరో సరికొత ప్లాన్ సిద్ధం చేసింది. ఒకే ఒక నగరం కాకుండా.. మరికొన్ని వేదికల్లో మ్యాచ్ లను నిర్వహించాలని చూస్తోంది. లీగ్ దశ మ్యాచ్ లను కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ఈ మేరకు ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాల అభిప్రాయాల్ని కూడా తీసుకోవాలని భావిస్తోంది. అయితే ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచులని మాత్రం అహ్మదాబాద్‌లో కొత్తగా ప్రారంభించిన నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
మొత్తానికి కొత్త షెడ్యూల్ పై కూడా బీసీసీఐ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ ఐపీఎల్ 2021 మ్యాచ్ లను నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే ఈ ప్లాన్ లో కూడా ఇప్పుడు ఓ సమస్య తలెత్తనుంది. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించిన షెడ్యూల్‌ని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దాంతో కోల్‌కతా, చెన్నైలో మ్యాచ్ లు, పోలింగ్ తేదీలు క్లాష్ కాకుండా చూసుకోవడం ఇప్పుడు బీసీసీఐకి సమస్యగా మారింది. బీసీసీఐ చివరికి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.