మహారాష్ట్ర వేరియంట్ రెండో దశలో దేశాన్ని వణికిస్తోంది. డబుల్ మ్యూటెంట్ వైరస్ చాపకింద నీరులా అతివేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ప్రతి మూడింట్లో ఒకటి మహారాష్ట్ర వేరియంట్ గా ఉంటుందని డబ్యూహెచ్వో వెల్లడించింది. వివిధ దేశాల్లో వైరస్ వ్యాప్తి, తీవ్రతపై విడుదల చేసిన నివేదికలో మహా వేరియంట్ గురించి ప్రస్తావించింది. ప్రపంచంలో అతి ప్రభావవంతమైన మ్యూటేషన్లలో ఈ డబుల్ మ్యూటెంట్ నాల్గో స్థానంలో ఉందని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా పదిరకాల వేరియంట్లు ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపింది. వాటిలో యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది. నాల్గో స్థానంలో మహారాష్ట్ర డబుల్ మ్యూటెంట్ ఉందని పేర్కొంది. ఏప్రిల్ నుంచి మేవరకు నమోదైన 44దేశాల్లోని 4,500 పరిశీలించినట్లు వివరించింది. ఇందులో మహారాష్ట్ర వేరియంట్ ఎక్కువగా ఉందని గుర్తించింది. డబుల్ మ్యూటంట్ వైరస్ తిరిగి మూడు రకాలుగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. మొదటి రకం 34 దేశాల్లో, రెండో రకం 31 దేశాల్లో మూడో రకం 4 దేశాల్లో ప్రభావం చూపుతోందని వెల్లడించింది.
డబుల్ మ్యూటెంట్ వైరస్ ను అక్టోబర్ లోనే గుర్తించినట్లు తెలిపింది. కాగా ఫిబ్రవరి నుంచి దీని వ్యాప్తి అధికమైందని పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో నమోదైన పాజిటివ్ కేసుల్లో 21 శాతం మొదటి రకం, 7 శాతం రెండో రకం, 5 శాతం మూడో రకం వైరస్ కేసులున్నట్లు వెల్లడించింది. దేశంలోని కేసుల్లో మహా వేరియంట్ 33 శాతం ఉందని వివరించింది. నిర్లక్ష్యం, కఠిన ఆంక్షలు పాటించకపోవడం వల్లే భారత్ లో కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయని నిపుణులు అన్నారు. ఎన్నికల సమావేశాలు, మతపరమైన సమావేశాలు వంటి జన సమూహాల వల్ల వైరస్ తీవ్రత అధికమైందని అంచనా వేశారు.
మహారాష్ట్ర వేరియంట్ అతి వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు. శరీరంలోకి ప్రవేశించగానే వైరస్ ప్రభావం చూపుతోందని చెప్పారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తులు పాడై న్యూమోనియా లక్షణాలకు గురై ప్రాణాంతకంగా మారుతుందని అంచనా వేశారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైరస్ సోకినా ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చూపలేకపోతుందని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న 90 శాతం మందిలో ఎలాంటి శ్వాససంబంధ సమస్యలు లేనట్లు గుర్తించామన్నారు. వ్యాక్సిన్ తీసుకొని వారు ఈ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారని చెప్పారు. కాబట్టి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత చురుగ్గా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.