ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కారణంగా దేశాలకు దేశాలే హడలిపోతున్నాయి. ఒకేసమయంలో యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన అరుదైన రికార్డు మాయదారి రోగానికే దక్కిందని చెప్పాలి. అత్యున్నత అధికారంలో ఉన్నవారి దగ్గరి నుంచి నిరుపేద వరకూ అందరిని ఒకేలా చూస్తే.. తన విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారెవరిని ఉపేక్షించకుండా తానేమిటో చూపిస్తున్న మహ్మమారి పుణ్యమా అని ఇప్పుడు సిత్రమైన పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే.. మహమ్మారి ముందు వరకు ఉన్న నెల్లూరు రాజకీయ లెక్కల్ని పూర్తి గా మార్చేసినట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపక్షంగా తమ సత్తా చాటేందుకు వీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేతలు పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. ఏపీ ప్రజలకు కొత్త రాజకీయాన్ని నేర్పిస్తూ.. స్థానిక ఎన్నికల్లో రికార్డుస్థాయి ఏకగ్రీవాలు జరిగేలా ప్లాన్ చేశారు. తాము అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందని భావించిన వేళలో హటాత్తుగా వచ్చి పడింది మహమ్మారి. దీంతో.. లెక్కలు మారి పోయాయి. ఎన్నికల్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవటం.. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తే.. పాత ఏకగ్రీవాలు ఉంటాయా? మళ్లీ ఏకగ్రీవాలు చేయించుకోవాలా? అన్నదిప్పుడు అధికార పక్ష నేతల్లో ప్రశ్నగా మారింది.
ఎన్నికల వేళలోనే మహమ్మారి ఎంట్రీ ఇవ్వటంతో అన్నింటికికలిసి వస్తుందన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాల్ని చేపట్టాయి పార్టీలు. వీటిల్లో అధికారపార్టీకి ఉండే వెసులుబాటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సద్వినియోగం చేసుకుందని చెబుతున్నారు.ఇదంతా బాగానే ఉన్నా.. అసలు సమస్య ఎన్నికల వాయిదాతో మొదలైందంటున్నారు. ఇంకేముంది? ఎన్నికలు జరిగిపోతాయని భారీగా ఖర్చు చేసిన తర్వాత.. ఎన్నికలు వాయిదా పడటంతో.. కొత్తగా ఎన్నికలు నిర్వహించే వేళలో పెట్టాల్సిన ఖర్చును గుర్తుకు తెచ్చుకుంటున్న వారికి గుండెల్లో మంట పడుతుందని చెబుతున్నారు. అధికారపక్షం పరిస్థితి ఇలా ఉంటే.. విపక్ష తెలుగు దేశం పరిస్థితి మరోలా ఉంది. ప్రతి ఏటా మాదిరి మేలో జరిగే మహానాడులో కొత్తగా జిల్లా.. మండల.. గ్రామ.. వార్డు.. బూత్ స్థాయి వారీగా కమిటీలు వేస్తుంటారు. ఈసారి మహమ్మారి దెబ్బకుఅలాంటివేమీ జరగలేదు. దీంతో.. పదవుల మీద ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే మిగిలింది. ఇప్పటివరకూజిల్లా పార్టీ కమిటీలు మాత్రమే ఏర్పాటు అయ్యాయని.. రానున్న రోజుల్లో వేసే కమిటీల్లో తమకు స్థానం దక్కుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా పదవుల కోసం ఆశ పడుతున్న వారిని ఎలా సంతోష పెడతారన్నదే అసలు సవాలుగా చెప్పక తప్పదు.
ఇక.. జిల్లాలోని బీజేపీ.. జనసేనల పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ రెండు పార్టీల్లో బీజేపీ నేతలు కాస్త ఖుషీగా ఉన్నారు. కారణం.. జనవరి లోనే జిల్లాల వారీ గా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలు నియమించటంలో ఎక్కువమందికి పదవులు దక్కటంతో వారంతా ఉత్సాహంగా ఉన్నారు. టీడీపీకి ఫ్యూచర్ లేదన్న భావనతో ఉన్నోళ్లు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారట. ఇక.. జనసేన పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటున్నారు. అధినేత ఎప్పుడు ఎలా రియాక్టు అవుతారో అర్థం కాని నేపథ్యం లో పార్టీ సంస్థాగతం గానూ వీక్ గా ఉండటం తో ఆ పార్టీ నేతలు మాత్రం నిరుత్సాహం గా ఉన్నట్లు చెబుతున్నారు.