హైదరాబాద్ లో సంపూర్ణ లాక్ డౌన్ ...క్లారిటీ ఇచ్చిన మంత్రి !

Update: 2020-06-13 07:30 GMT
తెలంగాణలో మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,484 కి చేరింది. వీరిలో 449 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు.  వైరస్ ‌‌తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 2278 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2032 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే , వైరస్ కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ నుండి  క్రమంగా సడలింపులు ఇస్తున్నారు.

అయితే , లాక్ డౌన్ నుండి సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రోజురోజుకి  నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇటువంటి తరుణంలో తెలంగాణలో పూర్తిస్థాయిలో  లాక్ డౌన్ విధించే ఆలోచన ఉందని, మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై సీఎం కెసిఆర్ తుది నిర్ణయం తీసుకుంటారు అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  స్వయంగా చేపినట్టుగా ఓ న్యూస్ వైరల్ అయింది. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు మంత్రి తలసాని, లాక్ డౌన్ విషయమై ఒక చానల్ లో తన పేరుతో వచ్చిన ప్రకటనను ఖండించారు. కాగా  వైరస్  కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ లో మళ్లీ లాక్‌ డౌన్ విధించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే , రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో చాలామంది మళ్లీ లాక్ డౌన్ ను పూర్తీ స్థాయిలో అమలు చేయాలనీ కోరుతున్నారు.
Tags:    

Similar News