హైదరాబాదీలకు వణుకు పుట్టిస్తున్న కరోనా .. 13 రోజుల్లో 14 వేల కేసులు !

Update: 2020-07-13 05:45 GMT
కరోనా వైరస్ ..కరోనా వైరస్ ..ఇప్పుడు  ప్రపంచం మొత్తం ఈ పేరు వింటేనే వణికిపోతోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చేందిన ఈ ప్రపంచం ఓక కంటికి కనిపించని వైరస్ దెబ్బకి వణికిపోతోంది. ఈ వైరస్   వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా కూడా వ్యాక్సిన్ అయితే కనిపెట్టలేకపోతున్నారు. దీనితో రోజురోజుకి ఈ వైరస్ భాదితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇకపొతే ఈ మహమ్మారి  ప్రభావం  మన దేశం పై అలాగే రెండు తెలుగు రాష్ట్రాలపై భారీగానే ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 8 . 8 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాలు కూడా కరోనా పాజిటివ్ కేసులలో పోటీ పడుతున్నాయి.

ముఖ్యంగా తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసుల్లో 70 శాతం కేసులు ఒక్క హైదరాబాద్ నగరంలోనే నమోదు అవుతున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ..హైదరాబాద్ లో కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉందొ. ఈ నెల మొదటి వారంలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నా , గత  నాలుగు రోజులుగా కేసుల తీవ్రత అంతగా లేదు.  గత నాలుగు రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో వెయ్యి లోపే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం హైదరాబాద్లో  800 మందికి వైరస్ సోకినట్లు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. శనివారం కంటే ఆదివారం 64 కేసులు అదనంగా నమోదయ్యాయి.

ఈ జులై నెలలో 3 వ తేదీ నుండి .. 8వ తేదీ వరకు ప్రతి రోజూ  1200 నుంచి 1660 మధ్య పాజిటివ్  కేసులు నమోదయ్యాయి.  ఆ తరువాత   800 నుంచి 920 మధ్య మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తంగా ఈ నెలలో   గడచిన 13 రోజుల్లో గ్రేటర్ లో 14,033 మందికి కరోనా వైరస్ సోకింది.  చూస్తే గ్రేటర్ హైదరాబాద్‌ లో ప్రతి గంటకి  49 మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. దీనితో గ్రేటర్ లో ఉన్న  ప్రజలు అప్రమత్తంగా లేకపోతె పరిస్థితి చేయిజారిపోయే ప్రమాదం ఉంది.
Tags:    

Similar News