ప్రాణాలు తీసే కరోనా మహమ్మారి భయపెడుతున్న వేళ.. ప్రజలు పండుగ చేసుకునే వాతావరణం ఉందా? అంటే.. ఉందని చెప్పాలి. అలాంటి పరిస్థితికి కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఓపక్క కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. అన్ని రాష్ట్రాల మాదిరే తెలంగాణ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితి రానున్న రోజుల్లో మరింత పెరగటమే కాదు.. మిగిలిన పనులకు అడ్డుపడేలా చేస్తున్న సంగతి తెలిసిందే. దీర్ఘకాలంగా సాగే కరోనాకు వెనక్కి తగ్గి పనులు నిర్వహించకుంటే జరిగే నష్టాన్ని అర్థం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు కొత్త అంశాలపై ఫోకస్ పెడుతున్నారు.
కరోనా విషయంలో రాష్ట్ర సర్కారు చేతులు ఎత్తేసిందన్న విమర్శలు.. ఆరోపణలు తీవ్రతరం అవుతున్న వేళ.. మాయదారి రోగానికి ఏ మాత్రం సంబంధం లేని సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించుతూ కీలక నిర్ణయాలు తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. తాజాగా మూడు గ్రామ పంచాయితీలకు చెందిన భూమిపై దశాబ్దాల కాలం సాగుతున్న పోరాటానికి చెక్ చెప్పేలా పరిష్కార మార్గాన్ని సూచించి.. వారంతా పండుగ చేసుకునేలా చేస్తున్నారు కేసీఆర్.
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల రెవెన్యూ పరిధిలో మూడు గ్రామాలు ఉన్నాయి. ఈ మూడు గ్రామాల్లో దాదాపు 258 మంది రైతులు దశాబ్దాల తరబడి భూరికార్డుల విషయంలో ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ మూడు గ్రామాల్లోని రైతుల సమస్య ఏమంటే.. వారి పూర్వీకులు భూస్వాముల వద్ద భూములు కొనుగోలు చేశారు. అయినప్పటికీ రైతుల పేర్లు రాకుండా దేశ్ ముఖ్ లు.. భూస్వాముల పేర్లురావటంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఉదంతంపై పలుమార్లు కేసీఆర్ వరకూ వెళ్లినా.. ఏమీ జరగలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా రైతుల పేరు మీద పట్టా మార్పిడి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యను పరిష్కరించకుండా.. పట్టించుకోనినేపథ్యంలో ఈ మూడు గ్రామాల వారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయమని తేల్చి చెప్పారు. దీంతో.. సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ మాట ఇచ్చారు. అందుకు తగ్గట్లే.. తాజాగా ఈ ఇష్యూను టేకప్ చేసిన సీఎం కేసీఆర్ ఇష్యూను ఒక కొలిక్కి తీసుకొస్తానని గ్రామస్తులతో నేరుగా మాట్లాడి హామీ ఇచ్చారు.
దీంతో.. ఆ మూడు గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు ఈ రోజున పండుగ చేసుకునే పరిస్థితి. కరోనా సంక్షోభ వేళ.. ప్రత్యేకంగా రంగంలోకి దిగిన కేసీఆర్ ఈ ఇష్యూపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. రెండు రోజుల్లో తమ సమస్యను తీరుస్తున్న కేసీఆర్ పై వారి అభిమానం ఏమేర పెరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటివి సీఎం కేసీఆర్ ఇమేజ్ ను అనూహ్యంగా పెంచే వీలుందని చెప్పక తప్పదు.