తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. అలాగే తెలంగాణలో కూడా 55 వేలకి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే దేశంలో కరోనా కేసులు 14 లక్షలు దాటిపోయాయి. ఈ నేపథ్యంలో అందరూ కరోనా వ్యాక్సిన్ కోసం వెయ్యి కళ్లతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే హ్యూమన్ ట్రయల్స్ చివరి దశకి చేరాయి. ఇకపోతే ప్రస్తుతానికి కరోనా పేషేంట్స్ కి 'రెమ్ డెసివర్' వాడుతున్నారు.
ప్రస్తుతం వీటిని విషమ పరిస్థితి లో ఉన్న బాధితులకు ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల ఈ 'రెమ్ డెసివర్' మందును బ్లాక్ మార్కెట్ లో దళారులు భారీ ధరలకు విక్రయిస్తున్న నేపధ్యం లో హెటిరో సంస్థ ఎండీ పార్థసారథి రెడ్డి.. ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న హైదరాబాద్ , విజయవాడ హెటిరో కార్యలయాల్లో ‘రెమ్ డెసివర్' ఇంజెక్షన్లను అందుబాటు లోకి ఉంచారు. కరోనా పేషెంట్ల కోసం మాత్రమే ఈ మెడిసిన్ అక్కడ విక్రయిస్తారు.
ఈ కరోనా మందు కావాల్సిన వారు ఈ కీలక పత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. అవేంటంటే ..
1. పేషేంట్ ఆధార్ కార్డు కలర్ జిరాక్స్ ,
2. కరోనా పాజిటివ్ టెస్ట్ రిపోర్ట్ జిరాక్స్
3. ఒరిజినల్ హాస్పిటల్ అడ్మిట్ కార్డు.. దానిపై ఇన్ పేషెంట్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి
4. డాక్టర్ స్టాంప్, సంతకం కలిగిన ప్రిస్క్రిప్షన్ స్లిప్
5.‘రెమ్‌డెసివర్' ఇంజెక్షన్ కోసం సంబంధిత హెటిరో కార్యాలయానికి వచ్చినవారు.. వారి ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాల్సి
ఉంటుంది. అలాగే , దాని జిరాక్స్ కాపీ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
6. ఆ కేంద్రాల్లో ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే విక్రయాలు, రూ. 32.400/- నెట్ క్యాష్ కూడా తీసుకు రావాలి.
హెటిరో సంస్థ కార్యాలయం- హైదరాబాద్:
House No 8-3-166/1&2, 1st Floor Challa's Estate, 18, Sultan Bagh, Erragadda, Moosapet, Hyderabad, Telangana 500082. Phone: 040 -23707171. Near Metro Pillar No. ERG 18
హెటిరో సంస్థ కార్యాలయం- విజయవాడ:
D.No.26-3-126, 2nd Floor, Nageswara Rao Pantulu Road, Gandhinagar, VIJAYAWADA – 520003, Krishna District, A.P.. Phone: 0866-6615811