ప్రజాస్వామ్యంలోని ప్రజా ప్రభుత్వాల మీద విమర్శలు.. ఆరోపణలు సహజం. ఆ మాత్రానికే ఉడికిపోకుండా.. వివరణలు ఇవ్వటం చాలా అవసరం. అందుకు భిన్నంగా ఎదురుదాడి చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీడియాతో పాటు.. సోషల్ మీడియా యాక్టివ్ గా మారిన నేపథ్యంలో వాస్తవాలకు సంబంధించిన వివరాలు ప్రజలకు ఇట్టే తెలుస్తున్న పరిస్థితి. ఇలాంటివేళ.. వీలైనంత పారదర్శకంగా ఉండటం ద్వారా ప్రజలకు కలిగే సందేహాల్ని తీర్చాల్సిన అవసరం ఉంది. దీనికి విపత్కర కాలంలో విమర్శలు ఎదురైతే.. అందులో వాస్తవం ఉంటే.. వాటిని స్వాగతిస్తూ.. సరిదిద్దుకుంటామన్న మాటతో పోయేదేమీ లేదు.
అందుకు భిన్నంగా నోటికి వచ్చినట్లుగా విరుచుకుపడటం వల్ల కొత్త తిప్పలు తప్పవు. తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొటోంది. కరోనాకు సంబంధించి మొదట్లో భారీ మైలేజీని సొంతం చేసుకున్న కేసీఆర్ సర్కారు.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కేసుల నమోదుతో పాటు.. బాధితులకు సౌకర్యాల్ని అందించే విషయంలో పెద్ద ఎత్తున లోటుపాట్లు చోటు చేసుకుంటున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని ఎత్తి చూపే మీడియా సంస్థలపై ప్రభుత్వం విరుచుకుపడుతోంది.
కేసీఆర్ సర్కారు మిస్ అవుతున్న పాయింట్ ఏమిటంటే.. కరోనా ప్రారంభం మొదలు మొన్నటి వరకూ తప్పులు దొర్లుతున్నా.. ప్రత్యేక పరిస్థితిని గుర్తించి సంయమనం పాటించింది. కానీ.. ఇవాల్టి రోజున పరిస్థితి అంతకంతకూ దిగజారటమేకాదు.. పలు విభాగాలు సరిగా పని చేయని పరిస్థితి. ఇలాంటివేళ.. ప్రభుత్వాన్ని హెచ్చరించేలా? నిద్ర లేపేలా? వచ్చే సమాచారంపై ఆగ్రహం వ్యక్తం చేసే కన్నా.. స్వాగతించటం మంచిది.
ఎందుకంటే.. తప్పుల్ని ఎత్తి చూపించినప్పుడు మొదట్లో కాస్త ఇబ్బంది కలిగినా.. వాటినిసరిదిద్దటం ద్వారా జరిగే ప్రయోజనాన్ని హర్షిస్తారు. ఈ ప్రాసెస్ లో మీడియా ఇమేజ్ పెరిగినా.. దాని వల్ల జరిగే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ.. ప్రభుత్వం బాగా చేసిందన్న భావన ప్రజల్లో పెరగటం చాలా ముఖ్యం. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. నిత్యం పొగడ్తలతో ముంచెత్తేసేటోళ్లు చుట్టూ ఉంటే జరిగే లాభం కంటే విమర్శలు చేసేటోళ్లు లేకపోతే జరిగే నష్టమే ఎక్కువ ఉంటుందన్న విషయాన్ని వేలాది పుస్తకాలు చదివిన కేసీఆర్ మిస్ కావటం ఏమిటి?