నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే అసెంబ్లీలోకి ... 58 మంది ఎమ్మెల్యేలు టెస్టులు !

Update: 2020-09-07 02:30 GMT
తెలంగాణ అసెంబ్లీ , శాసన మండలి సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సింగిరెడ్డి నిరంజన్ ‌రెడ్డి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారికి నెగెటివ్‌ అని రిపోర్ట్స్ వచ్చాయి. వారితోపాటు 58 మంది ఎమ్మెల్యేలు , 19 మంది మండలి సభ్యులు, 500 మంది పాత్రికేయులు, అధికారులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. ఒక ఎమ్మెల్సీ గన్‌ మెన్‌, ఓ ఉద్యోగి, ఒక పాత్రికేయుడికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో వారిని ఐసొలేషన్ ‌కు పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. హరీశ్‌ రావు మినహా మిగతావారికి నెగెటివ్‌ గా తేలింది. కరోనా నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే అసెంబ్లీ లోకి అనుమతి ఇస్తామని స్పీకర్ ప్రకటించారు.

ఇకపోతే , తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు వెల్లడించిన కరోనా కేసుల వివరాలు. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,802 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,711 మంది కోలుకున్నారు. దీనికి రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,771 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,10,241 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 895కు చేరింది. జీహెచ్‌ ఎంసీ పరిధిలో కొత్తగా 245 కరోనా కేసులు నమోదయ్యాయి. 
Tags:    

Similar News