‘తెలంగాణ ప్రభుత్వం కరోనా రోగులను గాలికి వదిలేసింది. టెస్టులు చేయడం లేదు. రోగులను పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రులు పేదలను పీల్చిపిప్పిచేస్తున్నాయి. ఓ వైపు ఉపాధి కోల్పోయి.. మరోవైపు ప్రభుత్వం పట్టించుకోక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు’ ఇవీ తెలంగాణ ప్రభుత్వంపై గత కొంతకాలంగా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్న ఆరోపణలు. అయితే ఈ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. తమపని తాము చేసుకుంటూ పోతోంది. అయితే ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులిటిన్ గమనిస్తే మాత్రం ఇక్కడ కరోనా తగ్గుముఖం పట్టినట్టే అనిపిస్తున్నది.
దీనిపై తాజాగా ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. తెలంగాణలో నిజంగానే కరోనా తగ్గుముఖం పట్టిందా? లేదా విపక్షాలు చెప్పినట్టు ప్రభుత్వం చెప్పేవన్ని తప్పుడు లెక్కలా? అయన మాటల్లోనే.. తెలంగాణలో కరోనా వ్యాధి అదుపులోనే ఉన్నది. ఈ వ్యాధి బారినపడ్డవారు సుమారు 81.54 శాతం మంది కోలుకుంటున్నారు. ప్రతి రోజు ఎంత మందికి కరోనా వస్తున్నదో.. అదే సంఖ్యలో కోలుకుంటున్నవారి సంఖ్య ఉన్నది. అయితే బాధితుల్లో 78 శాతం మంది ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్నవారే. వారు ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఆ మేరకు వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఐసీఎంఆర్ మార్గ దర్శకాలు అనుసరించే వైద్య సిబ్బంది టెస్టులు చేస్తున్నారు. వివరాలను ఆన్లైన్ లో పొందుపరుస్తున్నారు’ అని ఆయన చెప్పారు.
లక్షణాలు లేనివారే ఎక్కువ..
తెలంగాణ లో కరోనా లక్షణాలు లేకపోయిన కరోనా సోకుతున్నవారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. వీళ్లలో దాదాపు 95 శాతం మందికి ఇంట్లో ఉంచే చికిత్స అందిస్తున్నాం. వీరికి హితం యాప్ ద్వారా వైద్య సిబ్బంది సేవలను అందిస్తున్నది. ఇలా లక్షణాలు లేకుండా కరోనా వచ్చినవారికి 10 రోజుల పాటు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకపోతే వారిని ఇక నెగిటివ్ గా నిర్ధారిస్తాం. వారి పేరు నెగిటివ్ లిస్ట్ లోకి వెళ్లి పోతుంది. వీరికి మళ్లీ పరీక్షలు నిర్వహించబోము. ఇది ఐసీఎంఆర్ నిబంధన. ఒకవేళ అందులో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వారికి చికిత్స అందిస్తాం.