తెలంగాణలో సీన్ రివర్స్.. హైదరాబాద్ లో తక్కువగా.. శివారులో మరింత ఎక్కువగా
కరోనా మహమ్మారి షురూ అయిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో చిత్రమైన పరిస్థితి నెలకొని ఉండటం తెలిసిందే. చాలా రాష్ట్రాలకు భిన్నమైన రీతిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా నమోదయ్యే కేసుల్లో 90 శాతం కేసులు హైదరాబాద్ మహానగరానికే పరిమితమయ్యేవి. చాలా జిల్లాల్లో కేసులే నమోదు అయ్యేవి కావు. ఒకవేళ నమోదైనా.. అరకొర అన్నట్లు ఉండేవి.
కాస్తోకూస్తో కేసుల నమోదు అంటే.. హైదరాబాద్ కు అనుకొని ఉండే రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాల్లో కేసులు కొంతమేర నమోదయ్యేవి. అలాంటి తీరుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో చోటు చేసుకుందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర.. ఏపీ.. కర్ణాటకలో కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతున్నాయి. కానీ.. తెలంగాణలో మాత్రం కేసుల నమోదు తక్కువగా ఉండటం గమనార్హం.
మరింత ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గతానికి భిన్నంగా ఇప్పుడు మొత్తం కేసుల్లో హైదరాబాద్ మహానగరం వాటా తగ్గిపోతోంది. ఒకప్పుడు రాష్ట్రం మొత్తం మీదా నమోదైన కేసుల్లో 90 శాతం ఉంటే.. ఇప్పుడు పదిహేను శాతానికే పరిమితం కావటం గమనార్హం. మంగళవారం నాటి లెక్కనే తీసుకుంటే.. తెలంగాణలో 2296 కేసులు నమోదైతే.. అందులో జీహెచ్ఎంపీ పరిధిలో 321 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో జీహెచ్ఎంసీకి ఆనుకొని ఉండే రంగారెడ్డి జిల్లాలో 217.. మేడ్చల్ మల్కాజిగిరి లో 173.. నల్గొండ లో 155.. కరీంనగర్ లో 136 కేసులు నమోదయ్యాయి. రోజులో యాభైకి పైగా కేసులు నమోదవుతున్న జిల్లాల్ని చూస్తే.. తెలంగాణలో వీటి సంఖ్య పెరుగుతోంది.
వరంగల్ అర్బన్ లో 99.. సిద్దిపేటలో 92.. నిజామాబాద్ 82.. సంగారెడ్డి 81.. భద్రాద్రి కొత్తగూడెం 77.. కామారెడ్డి 77.. సూర్యాపేటలో 73.. మహబూబాబాద్ లో 72.. ఖమ్మం 69.. రాజన్న సిరిసిల్ల 67.. జగిత్యాలలో 50 కేసులు నమోదయ్యాయి. ఇదంతా చూస్తే.. గతానికి భిన్నమైన సీన్ కనిపించక మానదు. గతంలో హైదరాబాద్ మహా నగర కేంద్రంగా కరోనా కేసులు పెరిగిపోతుంట.. ఇప్పుడు అందుకు భిన్నంగా తగ్గిపోతుంటే.. జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇది కాస్త ఆందోళన కలిగించే అంశంగా చెప్పక తప్పదు.