కంటికి కనిపించని మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. కొద్ది నెలల క్రితం యూరప్ దేశాల్లో కేసుల నమోదు తగ్గటంతోకాస్త రిలీఫ్ అయ్యారు. అమెరికాలో పరిస్థితులుసర్దుకుంటున్నాయన్నంతలో.. సెకండ్ వేవ్ మొదలు కావటం.. పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటం షురూ అయ్యింది. ఒకసారి కరోనా కారణంగా చోటు చేసుకున్న విపరిణామాల నేపథ్యంలో.. ఈసారి మరింత జాగ్రత్తగా ఉంటున్న చాలా దేశాలు.. లాక్ డౌన్ ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
దీంతో.. భారత్ లోనూ సెకండ్ వేవ్ త్వరలోనే షురూ అవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనను పలువురు తప్పు పడుతున్నారు. ఫస్ట్ వేవ్ సరిగ్గా పూర్తి కాక ముందే సెకండ్ వేవ్ గురించి ఎలా అంచనా వేస్తారని చెబుతున్నారు. పరస్పర విరుద్దమైన ఈ వాదనలపై కొందరు నిపుణులు చెప్పే మాటేమిటంటే.. యూరోప్.. అమెరికాలలో కూడా కరోనా కేసు ఒక్కటి కూడా రాకుండా లేదని.. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టి.. కాస్త గ్యాప్ తీసుకొని మరింతతీవ్రంగా కేసులు నమోదు అవుతున్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు.
ఈ లెక్కన చూస్తే.. మన దేశంలోనూ రోజుకు 90 వేలకు పైనే కేసులు నమోదైన పరిస్థితి నుంచి ఇప్పుడు నలభైవేల వరకు నమోదవుతున్నాయి. 90వేలతో పోలిస్తే.. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో పురోగతి లేదన్నది మర్చిపోకూడదు. ఈ లెక్కన చేస్తే.. ఫస్ట్ వేవ్ చివర్లో మనం ఉన్నట్లుగా అర్థమవుతుంది. అదే నిజమైతే.. సెకండ్ వేవ్ మొదలు కావటానికి అట్టే సమయం తీసుకోదని చెబుతున్నారు. దీనికి తోడు ఈ నెలాఖరు నుంచి చలికాలం దేశంలో మొదలవుతుందని.. అది ఫిబ్రవరి వరకు సాగేఅవకాశం ఉండటంతో.. కేసుల నమోదు ఈ సమయంలో మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో చాలా రోజుల తర్వాత నాలుగు అంకెలుగా ఉన్నకేసుల నమోదు తాజాగామూడు అంకెలకు తగ్గటం గమనార్హం. ఆదివారం రాత్రి వరకునమోదైన కేసుల్ని చూస్తే 922గా తేలాయి. ఇటీవల కాలంలో ఇంత తక్కువగా కేసుల నమోదు ఇదేనని చెప్పాలి. ఇక.. ఈ 922లో హైదరాబాద్ మహానగరంలో (జీహెచ్ఎంసీ పరిధి) 256కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ట్రాఫిక్ పెరగటం.. ప్రజలు బయటకు రావటం.. రాకపోకలు భారీగా పెరిగిన వేళ.. ఇంత తక్కువ కేసులు నమోదు కావటం బాగానే ఉన్నా.. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు పెద్ద సందేహంగా మారిందని చెప్పక తప్పదు.