కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలం కావటం తెలిసిందే. తాజాగా సెకండ్ వేవ్.. ప్రపంచంలోని పలు దేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాటితో పోలిస్తే.. దేశంలో అలాంటి పరిస్థితులు పెద్దగా లేవనే చెప్పాలి. అయితే.. దేశ రాజధాని ఢిల్లీతో పాటు.. తమిళనాడు.. కేరళ రాష్ట్రాల్లో కేసుల నమోదు జోరు పెరిగినట్లుగా చెబుతున్నారు. అధికారిక గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పస్టం చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టటం.. లాక్ డౌన్ నిబంధనలు దాదాపుగా తీసివేయటం.. స్కూళ్లు.. కాలేజీలు.. సినిమా థియేటర్లు మినహా మిగిలిన అన్ని అందుబాటులోకి రావటం.. ప్రజలు సైతం గతంలో మాదిరి భయపడకుండా పనుల కోసం బయటకు రావటం పెరిగింది. గడిచిన కొన్ని నెలలుగా నిలిచిపోయిన పనుల్ని వేగిరం పూర్తి చేసుకోవటం మొదలు కావటంతో ప్రయాణాల జోరు ఎక్కువైంది.
మరి.. ఇలాంటి యాక్టివిటీస్ తో కరోనా కేసుల నమోదు పెరుగుతుందా? అన్నది సందేహం గా మారింది. కేసుల నమోదు బాగా తగ్గిపోయినట్లు కనిపిస్తున్న తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉంది. గడిచిన పది రోజులుగా కేసుల నమోదు ఎలా ఉందన్న విషయాన్ని చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపించాయి. వరుస పండుగల వేళ.. రాకపోకలు పెరగటం.. వాతావరణంలో వస్తున్న మార్పులు.. పలు చోట్ల భౌతిక దూరాల విషయంలో తగ్గుతున్న అప్రమత్తత.. వెరసి కేసుల నమోదు పెరుగుతున్నట్లుగా చెబుతున్నారు.
కేరళలో కీలకమైన ఓనం తర్వాత కేసులు భారీగా పెరిగినట్లే.. తెలంగాణలో దీపావళి తర్వాత కేసుల నమోదు పెరిగే అవకావం ఉందన్న మాట వినిపిస్తోంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇప్పుడు కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. అక్టోబరు 24 నాటి పరిస్థితి చూస్తే.. కరీంనగర్ లో రోజుకు సగటున 55-60 కేసులు నిర్దారణ అయితే.. ప్రస్తుతం ఇవి కాస్తా 90-100 మధ్యలో కేసులు నమోదుకావటం గమనార్హం.
ఇలాంటి పరిస్థితే మరికొన్ని జిల్లాల్లో ఉంది. మొత్తంగా చూస్తే.. తగ్గిన భౌతిక దూరం.. పెరిగిన ప్రయాణాలు.. షాపింగ్.. ఇతరత్రా కారణాల వల్ల సెకండ్ వేవ్ సంకేతాలు షురూ అయినట్లేనని చెబుతున్నారు. కాకుంటే.. మిగిలిన చోట్లతో పోలిస్తే.. తెలంగాణలో జోరు తక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా రానున్న మూడు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.