మంచి ఎక్కడ ఉంటే మాత్రం.. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఫాలో అయితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. కరోనా నేపథ్యంలో వాటి నిర్దారణకు చేసే టెస్టులకు గతంలో నిర్ణయించిన ధరల్ని తగ్గిస్తూ.. ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
ప్రైవేటు ల్యాబుల్లో కరోనా టెస్టుల కోసం గతంలో మాదిరి వసూలు చేసే అవకాశం లేకుండా ప్రభుత్వం జీవో జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం వ్యక్తిగతంగా శాంపిల్స్ తీసుకొచ్చే వారి నుంచి ప్రైవేటు ల్యాబులు రూ.వెయ్యి మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ప్రభుత్వం పంపే నమూనాలకు మాత్రం రూ.800 వసూలు చేయాలని తేల్చింది.
తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరహా నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకుంటే మంచిందంటున్నారు. గతంలో కరోనా నిర్దారణ కిట్ల ధరలు భారీగా ఉండేవి. దీంతో.. టెస్టుల కోసం వసూలు చేసే మొత్తాలు ఎక్కువగా ఉండేవి. ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్లే నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కాలంలో టెస్టులకు ఉపయోగించే కిట్ల ధరలు భారీగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ ధరల తగ్గింపును ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా.. ఇలా ధరలు తగ్గింపు నిర్ణయాల్ని వెంటనే తీసుకునే ఏపీని చూసైనా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోరు? ప్రజలకు మేలు చేసే అంశాలపై నిర్లక్ష్యం.. ఆలస్యం ఏ మాత్రం మంచిది కాదన్నది గుర్తిస్తే మంచిది.