వణికిస్తున్న మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ పరిశోధనలు చివరిదశకు రావటం.. త్వరలోనే వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించిన అనుమతులు ఇచ్చేసేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న వేళ.. అందుకు తగ్గట్లు రాష్ట్రాలు కూడా సిద్ధమవుతున్నాయి. వ్యాక్సిన్ విడుదలైన వెంటనే దేశ వ్యాప్తంగా 30 కోట్ల జనాభాకు టీకా వేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సుమారు 70 నుంచి 75 లక్షల మందికి తొలివిడతలో టీకా వేసే అవకాశం ఉన్నట్లుగా సర్కారు భావిస్తోంది.
ఎవరికైతే తొలిదశలో వ్యాక్సిన్ వేయాలనుకుంటున్నారో వారికి మూడు నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసులు వేయాల్సి ఉంటుంది. తెలంగాణలో 70 నుంచి 75 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్ వేయటమే లక్ష్యమైతే.. రాష్ట్రానికి కోటిన్నర డోసులు అందాల్సి ఉంటుంది. టీకాలు వేసేందుకు రాష్ట్రం పక్కా ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం 10వేల మందితో కూడిన భారీ టీంను సిద్ధం చేస్తున్నారు. ప్రతి టీంలో నర్సు.. ఏఎన్ఎం.. ఆశా కార్యకర్త ఇలా ముగ్గురు చొప్పున ఉంటారు. వీరు రోజుకు వంద మందికి టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే.. 10వేల టీంలు రోజుకు లక్ష మందికి చొప్పున.. వారంలో 70 లక్షల మందికి టీకాలు వేయాలన్నది లక్ష్యంగా పెట్టనున్నారు.
ఇంతకీ.. వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ఎప్పటికి షురూ కానుంది? అన్నది ప్రశ్నగా మారింది. అనుకున్నది అనుకున్నట్లుగా సాగితే మూడు నుంచి నాలుగు వారాల వ్యవధిలోనే వ్యాక్సిన్ కార్యాచరణ షురూ కానున్నట్లు చెబుతున్నారు. తొలిదశలో వ్యాక్సిన్ వేసే వారిలో ప్రభుత్వ.. పైవేటు రంగంలోని వైద్యులు.. ఇతర ఆరోగ్య సిబ్బందికి ఇవ్వనున్నారు. ఇందుకోసం దాదాపు కోటి మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కోటి మందైతే.. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉంటారన్న లెక్కను తెలంగాణ సర్కారు వేయగా.. 3 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తున్నారు. వ్యాక్సిన్ తమకే ముందు వేయించుకోవాలన్న ఎత్తుగడతో కొందరు తప్పుడు ధ్రువపత్రాల్ని సమర్పించటం.. లోగుట్టుగా మోసం చేసేందుకు ఉన్న దారుల్ని మూసివేసేలా కసరత్తు చేస్తున్నారు. ప్లానింగ్ విషయంలో పక్కాగా ఉన్నా.. ప్రాక్టికల్ గా వర్కువుట్ అవుతుందా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.