ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మహమ్మారి కొన్ని దేశాల్లో తన ప్రతాపాన్ని చూపించలేకపోతోంది. అదే సమయంలో మరికొన్ని దేశాల్లో మాత్రం ఎంతకు కొరుకుడుపడని రీతిలో వణికిస్తోంది. మిగిలిన దేశాలతో పోలిస్తే.. భారత్ లోనూకేసుల నమోదు తగ్గుతోంది. అదే సమయంలో.. దేశంలో ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాలు గా నిలిచిన చోట్ల కూడా కేసుల నమోదు తగ్గుతోంది. గడిచిన కొంత కాలంగా కేసుల నమోదు తగ్గుతున్న తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి.. అంతకంతకూ మెరుగవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే.. తెలుగు ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి నెలకొందని చెప్పాలి.
సోమవారం రాత్రికి నమోదైన కేసుల విషయానికి వస్తే.. తెలంగాణలో 491 కేసులు నమోదు కాగా.. ఏపీలో 500 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఒకదశలో తెలంగాణలో రోజుకు నాలుగు వేల కేసుల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక.. ఏపీలో చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకు 12 వేల కేసులతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఉక్కిరిబిక్కిరిఅయ్యే దుస్థితి. అలాంటి పరిస్థితి నుంచి తాజాగా రోజుకు 500 కేసులకు పరిమితం కావటం గొప్ప విషయంగా చెప్పాలి.
తెలంగాణలో నమోదైన కేసుల్లో పావువంతు కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. గ్రేటర్ లో 102 కేసులు నమోదైతే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 33.. రంగారెడ్డి జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 30 కంటే తక్కవ కేసులు నమోదవుతున్నాయి. 48వేల నమూనాలను పరీక్షించారు. ఇక.. ఏపీ విషయానికి వస్తే 61,452 నమూనాలని పరీక్షించగా.. 500 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొత్తంగా.. కేసుల నమోదులో రెండు తెలుగు రాష్ట్రాలు అంతకంతకూ తక్కువగా నమోదవుతున్నాయని చెప్పక తప్పదు.