కొత్త కరోనాను బ్రిటన్ లో గుర్తించటం.. అది మిగిలిన రకాలతో పోలిస్తే 70 శాతం వేగంగా విస్తరించటం.. పెద్ద వయస్కుల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపించటం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కరోనా కంట్రోల్ అవుతుందనుకున్న వేళ.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి.. దాని అంతు చూసే టైం ఆసన్నమైందని సంతోషించే లోపు.. చివర్లో వచ్చిన ట్విస్టు ప్రపంచాన్ని మరోసారి వణికిపోయేలా చేస్తోంది. ఇంతకీ ఈ కొత్త మహమ్మారిని ఇంగ్లండ్ లో ఎలా పట్టేశారన్న అంశంలోకి వెళితే.. ముందు నుంచి ఫాలో అవుతున్న కొన్ని అలవాట్లే కొత్తదాన్ని గుర్తించేలా చేసిందని చెప్పాలి. ఇందుకు బ్రిటన్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.
ఆ దేశంలో పాజిటివ్ అయిన ప్రతి పది కేసుల్లో ఒక దానికి జన్యు విశ్లేషణ జరుగుతుంది. అదే మనదేశంలో అయితే.. ప్రతి ఐదు వేల కేసులకు ఒకటి మాత్రమే జన్యు విశ్లేషణ చేస్తుంటారు. బ్రిటన్ లో కేసులు తగ్గిపోవటంతో గడిచిన రెండు నెలలుగా కరోనా జన్యు విశ్లేషణ నిలిచిపోయింది. ఇందుకు భిన్నంగా సౌత్ ఈస్ట్ ఇంగ్లండ్ లో కేసులు బాగా పెరిగినట్లుగా గుర్తించారు. పద్నాలుగు నెలల్లో నాలుగు రెట్లు పెరిగాయి.
పెరిగిన కేసుల్లో జన్యు విశ్లేషణ చేపట్టారు. ఆ క్రమంలో కొత్త వర్గానికి చెందిన కరోనాను గుర్తించారు. ప్రపంచంలో పది రకాల కరోనా కుటుంబానికి చెందిన వైరస్ లు ఉండగా.. అందులో కరోనా ఒకటన్న విషయం తెలిసిందే. ఇక.. కోవిడ్ లోనూ 11 రకాల ఉప గ్రూపులు ఉన్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 వైరస్ లో ఏ2ఏ కు చెందిన వైరస్ ముఖ్యమైనది. ఇదే మన దేశంలోనూ ఉన్నది.
ఇక.. తాజాగా బ్రిటన్ లో గుర్తించిన కొత్తది కోవిడ్ 19లో ‘బీ’ వర్గానిది. ఇది అనూహ్యంగా జన్యు మార్పులు జరిగి 29 రకాలుగా మార్పు చెందింది. సౌత్ ఈస్ట్ ఇంగ్లండ్ లో వారం.. పది రోజుల్లో నమోదైన వెయ్యి కేసుల్లో సగం ఈ కొత్త వర్గానికి చెందిన కేసులే కావటం గమనార్హం. గతంలో 5 శాతంగా ఉన్నవి ఇప్పుడు 50 శాతంగా పెరిగాయి. వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉన్నా.. మరణాలు మాత్రం పెద్దగా ఉండకపోవటమే ఈ ఎపిసోడ్ లో భారీ ఊరటగా చెప్పొచ్చు.