మొబైల్ లేనోళ్లు దాదాపుగా లేనట్లే. తిండి లేకున్నా చేతిలో మొబైల్ పెట్టుకొనేటోళ్లు బోలెడంతమంది కనిపిస్తారు. ఫోన్ ఏదైనా కాలర్ ట్యూన్ నచ్చింది పెట్టుకోవటమో.. దాని ఇష్టానికి ఏదో ఒకటి రావటమో మామూలే. కానీ.. మాయదారి మహమ్మారి పుణ్యమా అని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. దేశ వ్యాప్తంగా అందరి కాలర్ ట్యూన్లు రాత్రికి రాత్రి మారి పోయాయి. పెయిడ్ కాలర్ ట్యూన్లు ఉన్న వారి మినహా మిగిలిన అన్ని ఫోన్లు.. ఖళ్.. ఖళ్ అంటూ దగ్గుతో మొదలయ్యే మాయదారి రోగం కాలర్ ట్యూన్ గా మారింది.
మొదట్లో ఆసక్తిగా మారినప్పటికీ.. రెండు రోజులకే మొహం మొత్తేసింది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో దాన్ని అలా భరించినా.. తర్వాత కాలంలో దాన్ని ఏ మాత్రం భరించలేని పరిస్థితి. దీంతో.. నిమిషానికి అటు ఇటుగా ఉన్న కాలర్ ట్యూన్ కు కత్తెర వేసి చిన్నదిగా చేశారు. లాక్ డౌన్.. అందరూ ఇళ్లల్లో ఉండిపోయి.. స్నేహితులు.. సన్నిహితులు.. కుటుంబ సభ్యులు.. .ఇలా వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఫోన్లు తెగ మాట్లాడేసే నేపథ్యంలో.. ఈ ఖళ్.. ఖళ్ కాలర్ ట్యూన్ మస్తు ఫేమస్ గా మారింది.
దగ్గుతో మొదలయ్యే ఈ కాలర్ ట్యూన్ మాయదారి రోగం సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతుంది. అదే పనిగా రావటంతో విసిగిపోవటమే కాదు.. ఈ కాలర్ ట్యూన్ మీద బోలెడన్ని జోకులు.. సటైర్లు.. ట్రోలింగ్ బాగానే సాగింది. ఇంతకీ ఈ కాలర్ ట్యూన్ కు వాయిస్ ఇచ్చిందెవరు? ఆమె ఎక్కడ ఉంటారు? అన్న ఆసక్తి వ్యక్తమైంది.
ఇవాల్టి డిజిటల్ ప్రపంచంలో దేన్ని దాచలేరు. కాకుంటే.. కాస్తంత కసరత్తు చేయాలి. అదే పనిగా ప్రయత్నిస్తే దొరకందంటూ ఏమీ ఉండదన్న మాటకు తగ్గట్లే.. ఆ కాలర్ ట్యూన్ కు వాయిస్ ఇచ్చిన ఆమె డిటైల్స్ బయటకు వచ్చాయి. ఖళ్.. ఖళ్ అంటూ దగ్గే వాయిస్ కర్ణాటకకు చెందిన జెస్సికా ఫెర్నాండెజ్ ది. 32 ఏళ్ల జెస్సికా ఢిల్లీలోని కన్నడ సెకండరీ స్కూల్లో పీఈటీగా పని చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆమె తన సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చారు.
ఒక రోజు ఢిల్లీ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో ఆమె తన వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. రికార్డింగ్ సమయంలో ఆమె వాయిస్ కాలర్ ట్యూన్ గా మారుతుందన్న విషయం తెలీసదు. దాన్ని.. టీవీలోనో.. రేడియోలోనే ప్రసారం చేస్తారే తప్పించి.. దేశంలోని కోట్లాది ఫోన్లకు కాలర్ ట్యూన్ గా మారుతుందన్నది ఆమెకు తెలీదు. ఆ తర్వాత వాళ్ల అమ్మ ఫోన్ చేసి.. ఆమె వాయిస్ కాలర్ ట్యూన్ గా వస్తుందన్న విసయాన్ని గుర్తించి చెప్పటంతో ఆమెకు అసలు విషయం అప్పటికి అర్థమైందట.
దీంతో ఢిల్లీ స్టూడియో వారికి ఫోన్ చేసి తన డిటైల్స్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారట. అదే పనిగా రోజుల తరబడి కాలర్ ట్యూన్ గా మారటంతో ప్రజలు ట్రోల్ చేయటం.. తన వివరాలు తెలిస్తే.. తనను ఇబ్బంది పెడతారని భావించినట్లు ఆమె చెబుతారు. కానీ.. ఆమె ఎంత దాయాలనుకున్నా.. దాచలేకపోయారు. చివరకు ఆమె వివరాలు బయటకు వచ్చేశాయి. అయితే..ఆమె అంచనాలకు భిన్నంగా ట్రోల్స్ కంటే కూడా ప్రశంసలే భారీగా రావటంతో ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దగ్గుతో మొదలయ్యే కాలర్ ట్యూన్ జెస్సికాది అయితే.. మిగిలిన రెండు ట్యూన్లు మాత్రం విద్య నారాయణ్ భట్ స్వరాన్ని అరువిచ్చారు.