తెలుగు మ‌హాస‌భ‌ల్లో కేసీఆర్ మార్క్ ట్విస్ట్ ఉంద‌ట‌

Update: 2017-12-13 05:45 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు త‌న మార్కు చాటుకుంటూ ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న‌దైన శైలిలో ఏర్పాట్లు చేస్తూ ముందుకు సాగుతున్నారు. వంట‌కాల నుంచి మొద‌లుకొని అతిథుల జాబితా వ‌ర‌కు ఆయ‌న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌ పై ప‌లువురు తెలంగాణ‌వాదులే పెద‌వి విరుస్తున్నారు. ఉద్య‌మ‌కాలం నాటి కేసీఆర్‌ కు - ఇప్ప‌టి కేసీఆర్‌ కు పొంతన లేదంటున్నారు.

తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ఎవ‌రి తెలుగు త‌ల్లి? ఎవ‌రికి తెలుగు త‌ల్లి అని విమ‌ర్శించిన కేసీఆర్ ప్ర‌త్యేకంగా తెలంగాణ త‌ల్లిని రూపొందింప‌చేసిన సంగ‌తి తెలిసిందే. టీఆర్ ఎస్ అధికారిక కార్య‌క్ర‌మాల్లో తెలంగాణ త‌ల్లికే చోటు క‌ల్పించారు. ఏకంగా పార్టీ కార్యాల‌యంలో విగ్ర‌హం కూడా పెట్టారు. అయితే అంత‌టి ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్‌... ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో మాత్రం...తెలంగాణ త‌ల్లికి చోటివ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదే విషయాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లిని పూజించిన  ఇప్పుడు ఆ తల్లి లేకుండా ప్రపంచ తెలుగు మహాసభలు ఎలా జరుపుతున్నారని ఆయ‌న సీఎం కేసీఆర్‌ ను ప్ర‌శ్నించారు. నాడు ప్రజలకు మీరు చెప్పిందేమిటి? అధికారంలోకి వచ్చాక మీరు చేస్తున్నదేమిటి అని నిలదీశారు.

ఉద్యమ సమయంలో తెలుగు తల్లి వేరు - తెలంగాణ తల్లి వేరని చెప్పిన కేసీఆర్‌...ఇప్పుడు తెలంగాణ తల్లి లేకుండానే తెలుగు మహాసభలు ఎలా జరుపుతున్నారని శ్ర‌వ‌ణ్‌ ప్రశ్నించారు. తెలంగాణ సంస్కతీ లేకుండా - తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా తెలుగు మహాసభలు జరపడంలో అంతర్యమేమిటన్నారు. పుంటి కూర సభలా? గోంగూరసభాలా? అనక్కాయసభాలా?సొరకాయ సభాలా? తెలంగాణ తల్లి - తెలుగుతల్లి ఒకటేనా వేర్వేరా? ఒకటి కాకుంటే తెలంగాణ తల్లికి క్షమాపణ చెప్పి సభలు జరపాలని సూచించారు.

గాంధీభవన్‌ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను పక్కన పెట్టి సర్కారు ఈవెంట్‌ మేనేజ్‌ మెంట్‌ లా వ్యవహరిస్తుందని విమర్శించారు. మొన్న ఇవాంకా పర్యటన - ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు ఈవెంట్స్‌ లా  జరుపుతుందన్నారు.  ప్రపంచ మహాసభల సన్నాహక కమిటీలో దళిత - పేద - బడుగు - బిడ్డలకు స్థానం ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఆటా - పాటై ఎగిసిపడిన గద్దర్‌ - అందెశ్రీ - జయరాజ్  - విమలక్కలకు స్థానం లేదని ఆయ‌న ఆరోపించారు.
Tags:    

Similar News