మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి మరోసారి వార్తొల్లోకెక్కాడు. ఆ హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ అనుచరులు తనను బెదిరిస్తున్నారని దస్తగిరి ఆరోపించాడు. దీంతో మరోసారి దస్తగిరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
అవును... వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి అనుచరులు తనను బెదిరిస్తున్నారని దస్తగిరి తెలిపాడు. ఇదే సమయంలో.. తనను ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపించాలని వైకాపా నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించాడు. పులివెందులలో ఓ పిల్లాడిని తాము నిర్బంధించి హింసించామంటూ తమపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపాడు.
ఈ మేరకు తన భార్య షబానాతో కలిసి కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన దస్తగిరి... పులివెందుల పోలీసులు తనపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ విషయంపై కడప ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ కేసు గురించి సీబీఐ ఎస్పీకి కూడా సమాచారం అందించినట్లు చెప్పాడు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశాడు.
వివేకా హత్యకేసుకు సంబంధించి వైసీపీ శ్రేణులు రాజీకి రమ్మని రాయబారాలు పంపుతున్నారని దస్తగిరి వ్యాఖ్యానించారు. పెద్ద మనుషుల సమక్షంలో రాజీ జరిగితే డబ్బులు కూడా ఇప్పిస్తామంటూ ప్రలోభ పెట్టారని వెల్లడించారు. తాను చావడానికైనా సిద్ధం.. కానీ, రాజీపడే ప్రసక్తే లేదని దస్తగిరి చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా... వివేకా హత్య కేసులో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారని చెప్పిన దస్తగిరి... తనను కూడా లొంగతీసుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పాడు. తాను ఎవరికీ లొంగనని.. అన్నీ కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పుకొచ్చాడు. మరోపక్క తనను ఎలాగైనా జైలుకు పంపించాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు దస్తగిరి.
కాగా... దస్తగిరి రాయలసీమ జిల్లాలో సెటిల్మెంట్లు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దస్తగిరి దాదాగిరి చేశాడని.. అనంతరం అన్నమయ్య జిల్లాలో సెటిల్మెంట్లు చేశాడని.. రైల్వేకోడూరులో హల్ చల్ చేశాడని.. తనకు కేటాయించిన గన్ మెన్ లతో వెళ్లి హడావిడి చేస్తున్నాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే!