ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్!

Update: 2019-06-04 04:35 GMT
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం కుదిరింది. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల అనంతరం జరగబోతున్న తొలి సమావేశాలు ఈ నెల పన్నెండున మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల్లో నెగ్గిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 

ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఇలా కొత్త అసెంబ్లీ కొలువు తీరబోతోంది. ముఖ్యమంత్రి గా జగన్ మోహన్ రెడ్డి - ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయడు అసెంబ్లీలోకి ఎంటర్ కాబోతూ ఉన్నారు. అంతలోపే మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిగిపోనుంది. జూన్ ఎనిమిదో తేదీనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ ను ఏర్పరచనున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం కుదిరిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఏపీ కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది.

పదో తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. పన్నెండో తేదీన అసెంబ్లీ సమావేశాలు మొదలు అవుతాయి. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను మంత్రివర్గంలో చర్చించనుందట వైఎస్ ఆర్ కాంగ్రెస్  పార్టీ.

సాధారణంగా స్కూల్ పిల్లలకు జూన్ పన్నెండున పాఠశాలలు ప్రారంభం అవుతాయి. ఈ సారి  అదే రోజున ఏపీ అసెంబ్లీ మొదలు కానుంది.  కొత్త ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఎంతో ఆసక్తిదాయకమైన సన్నివేశాలు చోటు చేసుకొంటూ ఉంటాయి. ఈ సారి కూడా వాటికి  మినహాయింపు ఏమీ లేదు.


Tags:    

Similar News