ఏపీ శాసన సభ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. తాజా ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించిన వైసీపీ కొత్తగా అధికార పార్టీ హోదాలో సభలో అడుగుపెట్టనుంది. అదే సమయంలో నిన్నటిదాకా సభలో అధికార పక్ష హోదాలో కొనసాగిన టీడీపీ... అతి తక్కువ మంది సభ్యులతో విపక్ష స్థానంలో కూర్చోనుంది. అందరూ అనుకున్నట్లుగానే ఈ నెల 12 న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 12న సభా సమావేశాలు ప్రారంభం కానుండగా... 12 - 13 తేదీల్లో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక 13ననే అసెంబ్లీ స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరగనుంది. ఆ తర్వాత 14న శాసన సభ, శాసనమండలి సభ్యులతో ఉభయ సభల సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా శాసనసభను ఉద్దేశించి గవర్నర్ కీలక ప్రసంగం చేయనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే... శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో సభలో వ్యవహరించాల్సిన వ్యూహంపై ఇటు అధికార వైసీపీతో పాటు విపక్ష టీడీపీ కూడా పకడ్బందీ ప్రణాళికను రూపొందిచుకునే పనిలో పడ్డాయి.
అయితే ఈ సమావేశాల్లో పెద్దగా చెప్పుకోదగ్గ పరిణామలేవీ ఉండవన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే కొత్త సభ్యుల ప్రమాణం - స్పీకర్ - డిప్యూటీ స్పీకర్ ఎన్నిక - ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తదితరాలున్న నేపథ్యంలో ఇతర అంశాలపై అంతగా చర్చ సాగే అవకాశాలు లేవన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా నవ్యాంధ్రకు నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు తన కేబినెట్ కు ఓ రూపు ఇవ్వనున్నారు. ఎల్లుండి మంత్రులతో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత శాఖల కేటాయింపు, కేబినెట్ భేటీ తదితర కార్యక్రమాలున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను సుదీర్ఘంగా కొనసాగించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో సాధారణ కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.