వైరల్..అమ్మకు సంబంధాలు వెతుకుతున్న అమ్మాయి

Update: 2019-11-01 12:05 GMT
అప్పుడెప్పుడో అంటే.. రామోజీ ఫిలిం సిటీ ఒక కొలిక్కి వచ్చి టూరిస్టులను అనుమతించే సమయంలో టాలీవుడ్ లో మా నాన్నకు పెళ్లి అనే సినిమా వచ్చింది. ఆ సినిమాను అత్యధికం రామోజీ ఫిలింసిటీలోనే షూట్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ గురించి వినటమే కానీ చూడని చాలామంది ఆ సినిమాను చూశారు. అది అప్పటి కథ. ఆ రోజుల్లోనే తన తండ్రికి పెళ్లి చేయటం కోసం పడే తపనతో సినిమాను తీశారు.

కట్ చేస్తే.. తాజాగా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది. తన తల్లికి పెళ్లి సంబంధం చూస్తున్న ఆ అమ్మాయి తీరును పలువురు అభినందిస్తున్నారు. తాను పెళ్లి చేసుకొని వెళ్లిపోతే.. తన తల్లి ఒంటరి కాకూడదన్న ఉద్దేశంతో మంచి తోడు కోసం ప్రయత్నిస్తోందీ అమ్మాయి. ఇందుకు సోషల్ మీడియాను అసరా తీసుకున్న ఆమె వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

మా అమ్మకు యాభై ఏళ్ల వయసున్న హ్యాండ్సమ్.. జీవితంలో స్థిరపడిన వ్యక్తి.. శాఖాహారి అయి ఉండాలని  చెబుతోంది అస్తా వర్మ. తన తల్లితో పాటు కలిసి దిగిన తన ఫోటోను షేర్ చేసింది. ఎంత గొప్ప కూతురువి. తల్లీ కూతుళ్లు స్నేహితుల్లా ఉన్నారు.. ప్రతి వ్యక్తికి తోడు అవసరం.. అందుకు వయసుతో సంబంధం లేదు. అమ్మ గురించి నువ్వు ఆలోచిస్తున్న తీరు బాగుందని పలువురు అభినందిస్తున్నారు.

ఈ పోస్టుకు స్పందనగా తమకు తెలిసిన బ్యాచిలర్స్.. డైవోర్సీల పేర్లను ప్రతిపాదించటమే కాదు.. వారి వివరాల్ని షేర్ చేస్తున్నారు. అయితే.. తనకొచ్చిన వాటి నుంచి ఇప్పటివరకూ ఎవరిని ఎంపిక చేయలేదు. తనకొచ్చిన వాటిని చూసి.. వారిని వ్యక్తిగతంగా కలిసిన తర్వాత మాత్రమే తాము నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఏమైనా.. తల్లి గురించి కుమార్తె అస్తావర్మ పడుతున్న తాపత్రయం ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పక తప్పదు. 
Tags:    

Similar News