సినిమాల్లో తన నటనతో.. రియాల్టీ షోలతో తన టైమింగ్ తో.. రాజకీయాల్లో తన ఫైర్ బ్రాండ్ నేచర్ తో మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆర్కే రోజాకు షాకులు ఇవ్వటమే కానీ..
తాను షాక్ కు గురి కావటం చాలా అరుదు. అలాంటి రోజాకు ఆమె ముద్దుల తనయ ఊహించని రీతిలో స్వీట్ షాక్ ఇచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది.
రోజు - సెల్వమణి దంపతులకు ఒక కుమారుడు.. ఒక కుమార్తె. తాజాగా రోజా కుమార్తె అన్షు సాధించిన ఘనత ఆమెను వార్తల్లోకి తీసుకొచ్చింది. చిన్న వయసులోనే కంటెంట్ క్రియేటర్ గా.. వెబ్ డెవలపర్ గా..
ఆమె చేసిన దానికి తక్కువ సమయంలో మంచి పేరును సంపాదించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. చిన్న వయసులోనే తనకున్న పెద్ద మనసును ఆమె తన చేతలతో చేసి చూపించింది.
ఇప్పటికే ఐదుగురు పిల్లల్ని దత్తత తీసుకున్న అన్షు.. ఇటీవల ఆమె రాసిన ఒక పుస్తకానికి పురస్కారం లభించింది. దక్షిణ భారత దేశం నుంచి ఉత్తమ రచయితగా అవార్డును సొంతం చేసుకున్న ఆమెకు.. ఆ పురస్కారాన్ని కోల్ కతాలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. చిన్న వయసులోనే ఉత్తమ రచయిత్రిగా ఎంపికైన తీరుతో రోజాకు స్వీట్ షాక్ తగిలినట్లు చెబుతున్నారు.
ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంటున్న తీరుతో తెగ సంతోషపడుతున్న రోజా.. కుమార్తెపై ప్రశంసల వర్షాన్ని కురిపించింది. చిన్న వయసులోనే అందరి చేత వావ్ అనిపిస్తున్న కుమార్తె ఉన్నప్పుడు ఏ తల్లికి మాత్రం సంతోషం ఉండదు చెప్పండి.