తండ్రితో ఎలాంటి సంబంధం వద్దనుకునే కూతుళ్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అలాంటి కూతుళ్లకు తండ్రి ఆస్తిపై ఎలాంటి హక్కు లేదని తేల్చిచెప్పింది. తమ చదువు లేదా పెళ్లి కోసం తండ్రిని డబ్బు కోరే హక్కు ఉండదని ఓ కేసులో తీర్పునిచ్చింది. ఓ విడాకుల పిటీషన్ విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
ఓ యువతి తన తండ్రితో ఎలాంటి సంబంధాలు కొనసాగించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం ఆ యువతికి 20 ఏళ్లు. ఆమె చదువు, పెళ్లికి అయ్యే ఖర్చు విషయం ప్రస్తావించారు. తండ్రితో సంబంధం వద్దు అనుకునే కూతురికి అదే నాన్న డబ్బు పై కూడా ఎలాంటి హక్కు ఉండదు. చదువు, పెళ్లి కోసం తండ్రిని డబ్బు అడిగే అవకాశం లేదు అని సుప్రీంకోర్టుసంచలన తీర్పునిచ్చారు.
అయితే ఆ యువతికి కాకుండా ఆమె తల్లికి భరణం కింద ఒకేసారి డబ్బును ఇవ్వాలని కోర్టు పేర్కొంది. ఆ డబ్బును తన కూతురు చదువు కోసం తల్లి వినియోగించుకోవచ్చని తెలిపింది.
18 ఏళ్లు నిండిన కూతురు తండ్రితో బంధం తెంచుకుంటే ఆమె విద్య, పెళ్లికి అయ్యే ఖర్చులను తండ్రి భరించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మేజర్ అయ్యాక స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రతి అమ్మాయికి ఉంటుందని.. అయితే తండ్రినుంచి డబ్బు అడిగే అధికారం ఉండదని పేర్కొంది.
ఓ జంట విడాకులు తీసుకుంది. వారి కూతురు చిన్నప్పటి నుంచి తల్లి వద్దే ఉంటోంది. ఆమెకు ప్రస్తుతం 20 ఏళ్లు. తన తండ్రిని చూసేందుకు కూడా ఆమె ఇష్టపడలేదు. దీంతో సుప్రీంకోర్టు కూడా వారికి విడాకులు ఇచ్చింది. ఈ క్రమంలోనే తండ్రి ఆస్తిపై కూతురుకు ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది.
విడాకులు ఇచ్చినందున నెలకు రూ.8వేలు తన భార్యకు భరణంగా ఇవ్వాలని కోర్టు తెలిపింది. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్ మెంట్ కోసం అయితే రూ.10 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది.