మాజీ ప్రధానికి షాకింగ్ జాబ్ ఆఫర్!

Update: 2016-08-06 12:59 GMT
ఒక మాజీ ప్రధానమంత్రికి జాబ్ ఆఫర్ వచ్చింది. సాధారణంగా మాజీ ప్రధాని అయితే.. ఆ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటమో లేక రిటైర్ మెంట్ లైఫ్ ను అనుభవించడమో - అదీకాక ఎంపీగా కొనసాగడమో చేస్తుంటారు. అలాంటి ఒక మాజీ ప్రధాన మంత్రికి జాబ్ ఆఫర్ వచ్చింది. అది కూడా వేరే ఏదో ఒక ఉద్యోగం కాదు.. మరో దేశానికి సుల్తాన్ గా ఉండే ఉద్యోగం. కాకపోతే కండిషన్స్ అప్లై! ఈ ఆఫర్ వచ్చింది మరెవరికోకాదు.. బ్రెగ్జిట్‌ దెబ్బకు పదవిని కోల్పోయిన బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ కు!

బ్రిటన్ మాజీ ప్రధాని కామెరాన్ తన కెరీర్ పొలిటీషియన్ గానే కొనసాగించాలని వచ్చే ఏడాది కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో ఒకింత వికృతమైన - విస్మయం కలిగించే జాబ్ ఆఫర్ ఒకటి వచ్చింది. కజికిస్థాన్ దేశం ఈ జాబ్ ను ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ ఏమిటంటే.. తమ దేశ 'సుల్తాన్‌'గా ఉండాలని. దీనికోసం ఆయనకు ఏడాదికి 32మిలియన్‌ పౌండ్లు (రూ. 314,49 కోట్లు) జీతం ఇస్తామని కూడా భారీగా ప్రకటించింది కజికిస్థాన్. ఇంతవరకూ బాగానే ఉన్నట్లనిపిస్తున్నా... ఇక్కడే ఉంది అసలు కండిషన్! ఈ పదవికి కావాల్సిన అర్హతల్లో ఒకటి.. 'సుంతి' చేయించుకోవడం. ఈ కండిషన్ ను ప్రధానంగా పేర్కొంటూ నేరుగా కామెరాన్ కార్యాలయానికి జాబ్ ఆఫర్ పంపింది కజకిస్థాన్.

ముస్లిం యూనియన్‌ అయిన కజకిస్తాన్‌ ఇలాంటి వ్యంగ్య విషయాలతో గతంలోనూ వార్తల్లో నిలిచింది. దేశాధ్యక్షుడి వయస్సు 80 ఏళ్లు దాటితే ఉరితీయాలని, లంచాన్ని చట్టబద్ధం చేయాలనీ ఆ దేశ నియంత పాలకుడు 76 ఏళ్ల మురాత్‌ తెలిబెకోవ్‌ గతంలోనూ ఇలాంటి వ్యంగ్యోక్తులతో మీడియా దృష్టిని ఆకర్షించారు. కాగా ప్రస్తుతం ఎంపీగా 74వేల పౌండ్లు మాత్రమే జీతంగా అందుకుంటున్న కేమరూన్ ఈ జాబ్‌ చేపడితే బాగుంటుందని ఆయన ప్రత్యర్థులు ఛలోక్తులు విసురుతున్నారట! ఏ రాజకీయ నాయకుడికైనా పదవి పోతే ఇలాంటి చిన్న చిన్న అవమానాలు తప్పవేమో!!
Tags:    

Similar News