ఇదిగో తోక అంటే అదిగో పులి అనే సామెతను వినే ఉంటారు. డిజిటల్ యుగంలో.. అందునా సమాచార విప్లవం ఒక రేంజ్ లో సాగుతున్న వేళ.. పుర్రెకు తట్టే ప్రతి ఆలోచన వార్త రూపంలో వండేసే బ్యాచ్ ఒకటి మొదలైంది. దాన్ని సోషల్ మీడియాలో పెట్టేయటం ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీంతో.. చాలా సందర్భాల్లో నిజాల కంటే అబద్ధాలకు అత్యధిక ప్రాధాన్యతనున ఇస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. ప్రముఖులకు సంబంధించిన అంశాలను వార్తలుగా రాసే వేళలో.. అప్రమత్తత చాలా అవసరం.
అందుకు భిన్నంగా.. సరైన క్రాస్ చెక్ లేక కొన్ని వార్తలు ప్రధాన మీడియా సంస్థలు కూడా తప్పుగా రాసేస్తున్న పరిస్థితి. తాజాగా అలాంటి వార్త ఒకటి వైరల్ గా మారింది. అదేమంటే.. సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్ మన్ డేవిడ్ మిల్లర్ కుమార్తె మరణించిందని.. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో చిక్కుకుందని.. సౌతాఫ్రికా జట్టులోనూ విషాద ఛాయలు అలుముకున్నట్లుగా వార్తలు వచ్చేశాయి. ఇంతకీ ఈ వార్తకు మూలం ఏమంటే.. డేవిడ్ మిల్లర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
అందులో ''రెస్ట్ ఇన్ పీస్ మై లిటిల్ రాక్ స్టార్.. లవ్ యూ ఆల్వేస్'' అని పేర్కొంటూ ఒక చిన్నారి ఫోటోను.. అల్బమ్ వీడియోను పోస్టు చేశారు. సదరు పాపతో తాను తీసుకున్న పలు ఫోటోల్ని వీడియోగా మార్చి పోస్టు చేశారు. దీంతో.. ఆ పాపను.. డేవిడ్ మిల్లర్ కుమార్తెగా భావించిన మీడియా సంస్థలు అదే విషయాన్ని ప్రచారం చేయటం షురూ చేశాయి. అయితే.. అసలు విషయం ఏమంటే.. సదరు పాప డేవిడ్ మిల్లర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైన మిత్రుడి కుమార్తెగా చెబుతున్నారు.
ఇదే విషయాన్ని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా చెబుతున్నాయి. ట్విటర్ లోనూ ఒక యూజర్ ఇదే విషయాన్ని ప్రస్తావించి.. చనిపోయింది డేవిడ్ మిల్లర్ కుమార్తె కాదని.. అతని క్లోజ్ ఫ్రెండ్ కుమార్తెగా పేర్కొంటూ ట్వీట్ క్లారిటీ ఇచ్చారు. తనకు అత్యంత సన్నిహితులైన కుటుంబానికి చెందిన చిన్నారి కావటం.. ఆమెతో ఎమోషనల్ గా కనెక్టు కావటంతో.. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో అతగాడు షేర్ చేసుకుంటే.. అది కాస్తా తప్పుగా అర్థం చేసుకున్న మీడియా కారణంగా.. ఆ వార్త మరోలా వైరల్ అయిన పరిస్థితి.
ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న వన్డే సిరీస్ లో పాల్గొంటున్న డేవిడ్ మిల్లర్.. నిజంగా చనిపోయింది తన కుమార్తె అయితే ఇండియాలోనే ఎందుకు ఉంటారు? వెంటనే స్వదేశానికి వెళ్లిపోయే వారు కదా? అన్న ప్రశ్నను సంధిస్తున్ానరు. ఏమైనా.. చనిపోయింది డేవిడ్ మిల్లర్ కుమార్తె కాదు ఆయన స్నేహితుడి కుమార్తె అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.